NTV Telugu Site icon

Kiran Kumar Reddy: నేను సీఎం పదవి ఎవరినీ అడగలేదు.. దానికోసం ఎవరికీ కప్పు టీ కూడా ఇవ్వలేదు..

Kiran Kumar Reddy

Kiran Kumar Reddy

Former CM Kiran Kumar Reddy: మరోసారి తనకు ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చింది అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి.. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడారు.. నేను ముఖ్యమంత్రి పదవి ఎవరినీ అడగలేదు అన్నారు.. అందుకోసం ఎవరికీ కనీసం కప్పు టీ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.. కానీ, పదవి వచ్చినప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలనేది ఆలోచించాను.. అంతేకాదు.. ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చాలా సార్లు చెప్పాను.. వాళ్లు వినకపోవడంతోనే నేను మీడియా ముందుకు వచ్చాను అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు..

Read Also: Feelings Song : ‘పీలింగ్స్’ సాంగ్ కి యూట్యూబ్ లో రికార్డు రెస్పాన్స్..

మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీని మూడు నెలల ముందు కలిసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అన్నారు కిరణ్‌కుమార్‌.. ఇప్పటికీ కృష్ణా జలాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకూ సమస్య ఉందన్న ఆయన.. ఆంధ్ర ప్రదేశ్ కు పోలవరం ఒక వరం. పోలవరం పనులను త్వరగా పూర్తి చేసుకోవాలి. 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, 900 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి పోలవరంతోనే సాధ్యం అవుతుందన్నారు.. పక్క రాష్ట్రాలతో త్వరగా ఒప్పందాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణాలకు జరిగిన అన్యాయంపై నేను సీఎంగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో స్టే తెచ్చాం అని గుర్తు చేసుకున్న ఆయన.. ఆ స్టే ఇప్పటికీ అలాగే ఉందన్నారు.. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసికట్టుగా కృష్ణా జలాల వినియోగంపై శ్రద్ద పెట్టాలి. అమరావతిని త్వరగా పూర్తి చేసుకోవాలి. ఎంత వేగంగా అభివృద్ధి చేస్తే, అంతకంటే వేగంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు..

Read Also: Vijay Devarakonda : ఈ సారి తగ్గేదేలే.. VD 14 కూడా పెద్ద ప్లానింగేనా..?

ఏపీ అప్పుల మయంగా మారింది.. అభివృద్దిలో బాగా వెనుకపడ్డాం అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం కిరణ్.. అభివృద్దిని వేగవంతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన.. జమిలి ఎన్నికల బిల్లుతో పాటు మరిన్ని బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉందన్నారు.. కరోనా వంటి గడ్డు పరిస్థితుల వల్ల స్టాక్ మార్కెట్లు కూడా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.. ఇప్పుడు సెన్సెక్ పెరుగుతోందన్నారు.. మరోవైపు, వైఎస్‌ జగన్ కు బీజేపీ సపోర్టు చేస్తుందని అనడం సరికాదని హితవు చెప్పారు.. అది కోర్టుల్లో ఉన్న వ్యవహారం. సీబీఐ, ఈడీ, కోర్టులకు సంబంధించినది. ఏడాదిలోపే విచారణ పూర్తి కావాల్సి ఉన్నా, ప్రజాస్వామ్యంలో లొసుగుల వల్ల జాప్యం జరుగుతుండవచ్చు అన్నారు.. ఇక, బీజేపీ రాష్ట్రంలో బలోపేతం అవుతోందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి..

Show comments