Peelings Song : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం పుష్ప 2. ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్-ఇండియా లెవల్లో విడుదల అయింది. బాక్సాఫీసు వద్ద ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి రూ.1831కోట్లను కొల్లగొట్టింది. రష్మిక, అల్లు అర్జున్ మధ్య పీలింగ్స్ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరో హిట్ అందుకుంది రష్మిక మందన్నా. ఈ సినిమాలో శ్రీవల్లి 2.0గా మెప్పించింది. ముఖ్యంగా తన యాక్టింగ్ తో అదరగొట్టారు.
Read Also:India On Pak: అమాయకులపైన ఏంట్రా మీ ప్రతాపం..ఆఫ్ఘన్‌పై పాక్ దాడిని ఖండించిన భారత్..
ఈ చిత్రంలో రష్మిక యాక్టింగ్ వేరెలెవల్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో పీలింగ్స్ పాటలో తన స్టెప్పులతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ పాట రిలీజ్ అయ్యాక.. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. అయితే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ హిట్ గా నిలిచాయి.
Read Also:Winter Season: చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే ఈ గింజల్ని తింటే సరి
మరి పుష్ప 2 ఆల్బమ్ నుంచి కిస్సిక్, పీలింగ్స్ సాంగ్ ని మేకర్స్ లేట్ గా విడుదల చేసినా.. వీటిలో అంతకు ముందు చాలా కాలం మునుపే వచ్చిన సాంగ్స్ కి మించి పీలింగ్స్ సాంగ్ రికార్డు రెస్పాన్స్ అందుకుంది. మరి ఆ అన్ని సాంగ్స్ కంటే పీలింగ్స్ సాంగ్ రికార్డు లెవెల్లో 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది. దీనితో పీలింగ్స్ సాంగ్ విన్న ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్స్ తెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.