CM Chandrababu: నెల్లూరు జిల్లా కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు (ఫిబ్రవరి 15) పర్యటించబోతున్నారు. నేటి ఉదయం 11.45 గంటలకి టీఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం వద్ద దిగి.. అక్కడి నుంచి కోవూరు రోడ్డు మీదగా దూబగుంట సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఎంఆర్‌ఎఫ్ ఫెసిలిటీ సెంటర్ (వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్)కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత దూబగుంట గ్రామంలోని స్థానికులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు.
Read Also: Jagityala: దమ్మన్నపేటలో భారీ చోరీ.. పొలం పనులకు వెళ్లి తిరిగొచ్చేలోపే 14 తులాల బంగారు ఆభరణాలు మాయం
ఇక, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కాలనీలు, డ్రైనేజీలు శుభ్రం చేసే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఎంపిక చేసిన మూడు గృహాలలో ఇంకుడుగుంతలను సైతం ఆరంభించనున్నారు. అనంతరం పార్కు కమ్ పాండ్‌ను ఆయన సందర్శించనున్నారు. ఆ తర్వాత కందుకూరులోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో మాట్లాడటంతో పాటు మున్సిపాలిటీలోని ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం హెలిపాడ్ వద్దకు చేరుకుని ఉండవల్లికి తిరిగి పయనం అవుతారు. ఇక, సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు.