CM Chandrababu: నెల్లూరు జిల్లా కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు (ఫిబ్రవరి 15) పర్యటించబోతున్నారు. నేటి ఉదయం 11.45 గంటలకి టీఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం వద్ద దిగి.. అక్కడి నుంచి కోవూరు రోడ్డు మీదగా దూబగుంట సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఎంఆర్‌ఎఫ్ ఫెసిలిటీ సెంటర్ (వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్)కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.