ఏపీలో జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. పాతకొత్త కలయికతో మంత్రులు కొలువుదీరారు. అవినీతిలో కూరుకున్న వారిని కేబినెట్ లోకి తీసుకున్నారని, జగన్ కేబినెట్ లో మంత్రులకు పవర్ ఉందా ? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సీఎం జగన్ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలరా?
బీసీలను ముఖ్యమంత్రిని చేసి జగన్ డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు కదా అన్నారు. 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లకు టేబుల్ – కుర్చీలైనా ఉన్నాయా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. టీడీఆర్ కుంభకోణంలో ఉన్న కారుమూరికి మంత్రి పదవి ఇచ్చారు. కుటుంబ పార్టీల వల్ల మంత్రులకు పవర్
ఉండదన్నారు. పవర్ ఫుల్ బీసీ నరేంద్రమోడీకి ప్రపంచం జేజేలు పలుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్లే విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు.
సంక్షేమ పథకాలకు వాటి ప్రకటనలకు ముందుగా చెల్లింపులు చేస్తున్నారు. విద్యుత్ కు ముందుగా ఎందుకు చెల్లించరన్నారు. పాత హోంమంత్రి సుచరిత తన పదవీ కాలంలో ఒక్క డీఎస్పీనైనా ట్రాన్స్ ఫర్ చేయగలిగారా ? కొత్త హోంమంత్రి తానేటి వనితకు కానిస్టేబుల్ ని కూడా బదిలీ చేయగలరా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు.