ఏపీలో జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. పాతకొత్త కలయికతో మంత్రులు కొలువుదీరారు. అవినీతిలో కూరుకున్న వారిని కేబినెట్ లోకి తీసుకున్నారని, జగన్ కేబినెట్ లో మంత్రులకు పవర్ ఉందా ? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సీఎం జగన్ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలరా? బీసీలను ముఖ్యమంత్రిని చేసి జగన్ డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు కదా అన్నారు. 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లకు టేబుల్ – కుర్చీలైనా ఉన్నాయా? అని సోము…
ఏపీలో కేబినెట్ కూర్పుపై తర్జన భర్జన పడుతున్నారు వైసీపీ నేతలు. ఎవరికి అవకాశం ఇవ్వాలి. ఎవరిని కొనసాగించాలనేదానిపై సుదీర్ఘంగా చర్చలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ ముగిసింది. వరుసగా రెండో రోజు మూడు గంటల పాటు కొనసాగింది సమావేశం. దాదాపుగా కొత్త మంత్రివర్గం జాబితా సిద్ధమయిందని తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, అనుభవం, పార్టీకి విధేయత అంశాల ఆధారంగా జాబితాను సిద్ధం చేశారంటున్నారు. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్…