Site icon NTV Telugu

Pawan Kalyan and Somu Veerraju: జనసేనపై కుట్ర.. కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లా..!

Somu Veerraju

Somu Veerraju

జనసేనపై కుట్ర చేస్తున్నారు.. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.. ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించామని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న పవవన్‌ కల్యాణ్‌ను నోవాటెల్‌ హోటల్‌లో కలిసిన ఆయన.. విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలపై, ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు ఆ తర్వాత ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు ఇద్దరు నేతలు.. తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖలో నిన్నటి ఘటన పూర్తిగా ప్రభుత్వ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. సన్నాసులు ఏదో వాగుతారని, వారి గురించి పట్టించుకోనవసరంలేదని అభిప్రాయపడ్డారు. విజయనగరంలో‌ బీజేపీ కార్యకర్తలపై నుంచి వైసీపీ దాడి ప్రారంభమైందన్న పవన్.. ప్రతిపక్ష పార్టీలు నేతలపై దాడులతో భయ పెడుతున్నారు.. జనసేన నాయకుల‌పై అన్యాయంగా కేసులు పెట్టారు.. నిన్న ఘటన పూర్తిగా ప్రభుత్వం కుట్రగా భావిస్తున్నాం అన్నారు.

Read Also: Income Tax Raids: నెల్లూరులో ఐటీ దాడుల కలకలం..

ఇక, సోము వీర్రాజు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ యాత్రను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో ఆందోళన కలిగించే అంశం అన్నారు. జనసేనాధిపతిగా అనేక కార్యక్రమాలు, పర్యటనలు‌ చేపట్టారు.. వైసీపీవారు వారికి వారిగా ఒక ఉద్యమం చేస్తున్నారు.. వాళ్ల కార్యక్రమానికి స్పందన రాకపోవడంతో జనసేనపై కుట్ర చేశారు ఆరోపించారు.. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.. ఈ అంశాలను కేంద్ర పెద్దలకు కూడా వివరించామన్నారు సోమువీర్రాజు.. వారు కూడా వైసీపీ ప్రభుత్వం దుశ్చర్యలపై పోరాడాలని సూచించారని.. రాష్ట్ర ప్రభుత్వం దమన చర్యలపై పోరు ఉమ్మడిగా సాగిస్తాం అన్నారు.. విశాఖ గర్జన రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్ ప్రోగ్రాంగా విమర్శించిన సోము వీర్రాజు.. జన స్పందన లేక పోవడంతో కుట్రకు తెర లేపారు.. ఇక నుంచి ఇటువంటి వాటిని అడ్డుకుని తీరుతాం అన్నారు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయి అనేది ప్రచారం మాత్రమే అన్నారు సోము వీర్రాజు..

Exit mobile version