Somu Veerraju: పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్.. సోమువీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించిన విషయం విదితమే.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు మరికొందరు నేతలను కలిశారు.. అయితే, బీజేపీ-జనసేన పొత్తు వ్యవహారంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు.. బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.. దేశానికి జగ్జీవన్ రాం ఎన్నో సేవలందించారని గుర్తుచేసిన ఆయన.. ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారు.. దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు జగ్జీవన్ రాం ఆహార మంత్రిగా చేశారు.. 1977లో జగ్జీవన్ రామ్‌ను దేశ ప్రధానిని చేయాలని ఆనాటి జనతా పార్టీ ప్రయత్నించిందని తెలిపారు.
Read Also: Today Business Headlines 05-04-23: ముగ్గురూ.. ముగ్గురే. ఒక్కొక్కరికి 30 బ్రాండ్లు. మరిన్ని వార్తలు
Also Read
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
ఇక, జనసేన, బీజేపీ పొత్తులపై సోము వీర్రాజు మాట్లాడుతూ.. జనసేన-బీజేపీ కలిసి ముందుకెళ్తాయి.. కలిసే ఉన్నాం అని స్పష్టం చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన-బీజేపీ కలిసి పోరాడతాయన్న ఆయన.. చంద్రబాబుతో పవన్ కల్యాణే కాదు.. నేను కూడా వివిధ సందర్భాల్లో చంద్రబాబుతో భేటీ అయ్యాను అన్నారు. రాజకీయాల్లో వివిధ పార్టీల నేతలు కలవడమనేది సర్వ సాధారణమైన విషయం.. ఎవ్వరూ కంగారు పడాల్సిన పనిలేదన్నారు.. మరోవైపు.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఆలయాలపై దాడులు పెద్ద ఎత్తున జరిగాయి. ఏపీలో హైంధవ ధర్మం అపహస్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఫిరంగిపురంలో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని మండిపడ్డారు. హిందూమతంపై దాడులు జరుగుతోంటే ఒక్క అరెస్టైనా జరిగిందా..? ఏపీలో ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్నారు.. కానీ, దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తీరు మారకుంటే.. కపిల తీర్థం నుంచి రామ తీర్థం వరకు యాత్ర చేపడతామని ప్రకటించారు వీర్రాజు.
మరోవైపు.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ దారుణం అన్నారు సోము వీర్రాజు.. పరీక్ష లీకేజీ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్న ఆయన.. పేపర్ లీకేజీ మీద బండి సంజయ్ కు ఎలాంటి సంబంధం ఉంటుంది..? అని ప్రశ్నించారు. అవినీతి సంపదతో దేశ రాజకీయాలు నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆప్, బీఆర్ఎస్ పార్టీలు తెర మరుగు కావడం ఖాయం అని జోస్యం చెప్పారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కాగా, వైసీపీ ముక్త్ ఆంధ్రప్రదేశ్ అన్నది తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం విదితమే.. ఆ దిశగానే తమ అడుగులు ఉంటాయని అన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. అనేక అంశాలపై లోతుగా చర్చించామని అన్నారు. అధికారం సాధించేందుకు ఏం చేయాలో చర్చించామని చెప్పారు. తన ఢిల్లీ టూర్ సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. వైసీపీని ఓడించడమే బీజేపీ, జనసేన లక్ష్యమని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!