ప్రకాశం :విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కాదని పేర్కొన్న ఆయన… స్టీల్ ప్లాంట్ ని కాపాడే బాధ్యత ఏపి బీజేపీదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తున్న నాయకులు డెయిరీలు, స్పిన్నింగ్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు ప్రవేటీకరణ చేస్తే ఏం చేశారని… పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడం వలన సామాన్యులపై భారం పడిందన్నారు. దీనిపై బీజేపీ ఆవేదన చెందుతోందన్నారు. పెట్రోల్, డీజీల్ ధరలు కేంద్రానికి ఆదాయ వనరులు కాదని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం వల్లే… రాష్ట్రంలో దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.