Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ నవరత్నాల కంటే ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమమే ఎక్కువ అన్నారు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిలుగా గుజరాత్ ఎమ్మెల్యే, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి శంభు నాథ్ తొండియా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివ న్నారాయణ, సోము వీర్రాజు హాజరయ్యారు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు వీర్రాజు.. సబ్ ప్లాన్ నిధుల కోసం బీజేపీ ఎస్సీ మోర్చా 48 గంటలుదీక్ష చెపట్టింది.. మిగిలిన పార్టీలు మీటింగ్ లు పెట్టి వెళ్లిపోవడమే కానీ, బీజేపీ మాత్రమే వారి సమస్యలపై పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీయే.. ఏప్రిల్‌లో ఎస్సీల బహిరంగసభ విజయవాడ లో నిర్వహించబోతున్నాం అన్నారు.. జగన్ ప్రభుత్వం పైన గళమెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. ఎస్సీల ను ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుటుందని ఆరోపించారు.
Read Also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
ఇక, ఏపీలో అభివృద్ధి లేదు, తిరోగమనం పాలైంది. నాలుగు లక్షల కోట్లు రాష్ట్రం ప్రభుత్వం అప్పులు చేశారని విమర్శించారు సోము వీర్రాజు.. వైన్ మాఫియా, శాండ్ మాఫియా వైసిపి చేస్తుందని ఆరోపించారు. ఏపీని అభివృద్ధి చేయకుండా అవినీతి చేస్తూ ట్రేడింగ్ కంపెనీ మాదిరి రాష్ట్ర ప్రభుత్వం తయారైందన్నారు. వాలంటీర్ వ్యవస్ధ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.. 35 లక్షల ఇళ్లు , 1 లక్షా 80 వేల రుణం కేంద్రమే ఇస్తుందని గుర్తుచేశారు. విద్య ద్వారా ఎనిమిది రకాల సేవలను అందిస్తున్నాం.. జగన్ నవరత్నాలు కన్నా మోడీ సంక్షేమమే ఏపీలో ఎక్కువ అని తెలిపారు. ఇవేగాక 8 లక్షల కోట్ల రూపాయలు ఏపీకి అదనంగా కేటాయించి అభివృద్ధి చేస్తున్నాం.. వైసీపీ, టీడీపీ కేంద్రం చేసింది ఎందుకు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మేం సంక్షేమం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ప్రజలను చంపేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 2024లో అధికారంలోకి రావడానికి అర్హత ఉన్న పార్టీ.. బీజేపీనే.. ఏపీ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా. కేంద్రమే ఏపీలో సంక్షేమం చేస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వానిది ఏమీ లేదన్నారు సోము వీర్రాజు.