నాడు గ్రాఫిక్స్ అని తిట్టి… నేడు భూములు తాకట్టు పెట్టబోతున్నారు: సోమిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి కార్పొరేషన్ పేరుతో జగన్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిటిబ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. అమరావతి రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని… కార్పొరేషన్ పేరులోనే క్యాపిటల్ సిటీ అని పేర్కొని కొత్త కుట్రకు తెరలేపారని విమర్శించారు.
రాజధాని పరిధిలో ఎలా ముందుకెళ్లాలన్నా తమ అనుమతి అవసరం అని స్పష్టం చేసిన హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తుందని సోమిరెడ్డి ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతి తీసుకుని రైతులు కోరుకుంటున్నట్లు 29 గ్రామాలను ఒకే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక అధికారులు ఓటు హక్కు ఉన్నవారే అభిప్రాయాలు తెలపాలంటున్నారని.. మరి పులివెందులలో ఓటుహక్కు ఉన్న జగన్ అమరావతిపై నిర్ణయాలు ఎలా తీసుకుంటారని నిలదీశారు.
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
అమరావతి పరిధిలో ఎకరా రూ.7 కోట్లు విలువ చేస్తుందని చెప్తూ 480 ఎకరాల తాకట్టుకు ఇప్పటికే ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసిందని సోమిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తేనే రైతుల త్యాగం చేసిన 34 వేల ఎకరాల విలువ రూ.2 లక్షల కోట్ల పైబడి ఉంటుందన్నారు. నాడు స్మశానం, గ్రాఫిక్స్ అని తిట్టిన ప్రభుత్వ పెద్దలు.. నేడు రూ. 2 లక్షల కోట్ల పైబడిన అమరావతి భూములను తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండానే వారి భూముల తాకట్టుపై జగన్ కన్నుపడటం దుర్మార్గమన్నారు. రైతులు పెట్టే అన్నం తింటున్న జగన్ వారినే మానసిక క్షోభకు గురిచేస్తున్నారని.. రైతుల మనోవేదనకు వ్యతిరేకంగా వెళ్తే జగన్‌ను దేవుడు కూడా క్షమించడని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
Read Also: సీఎం జగన్‌కు నారా లోకేష్ బహిరంగ లేఖ
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?