Somireddy Chandramohan Reddy : చేతకానితనంతో ప్రైవేటీకరిస్తామంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రానికి సూడో విద్యుత్ శాఖ మంత్రిగా షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ సీఎం చెప్పారని విద్యుత్ శాఖ బాధ్యతలన్నీ షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ కు అప్పగించారన్నారు. విద్యుత్ శాఖకు అవసరమైన అనేక పరికరాలు ఎక్కువ ధరకు ఈ షిరిడీ సాయయే సంస్థే సరఫరా చేస్తోందని, విద్యుత్ శాఖలో ముగ్గురు సీఎండీల నియామకం కూడా కడప రెడ్డికి చెందిన షిరిడిసాయి సంస్థ ప్రభావమేనని ఆయన మండిపడ్డారు. విద్యుత్ శాఖలో నష్టాలు పెరిగేందుకు కారణం ప్రభుత్వ అసమర్థత, షిరిడిసాయి సంస్థ పెత్తనమేనని ఆయన ఆరోపించారు. కృష్ణపట్నంలో దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరించాలనుకోవటం దుర్మార్గమని ఆయన విమర్శించారు.
కాలుష్యం తగ్గిస్తూ విద్యుతుత్పత్తి చేసే తొలి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ను అదానీ చేతుల్లో పెట్టడాన్ని ఒప్పుకోమని, 25 ఏళ్లకు విద్యుత్ ప్లాంట్ ను లీజుకివ్వటాన్ని వ్యతిరేకిస్తూ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3వేల మంది బతుకులు ఆ విద్యుత్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయని, చేతకానితనం, అసమర్థతతో నడపలేమంటూ ప్రైవేటీకరిస్తామంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. అరబిందో బంధువులకు చెందిన నాలెడ్జ్ సంస్థ రూ.700కోట్లు నష్టం చేకూర్చేలా ఎర్రమట్టి కలిసిన నాశిరకం బొగ్గు విద్యుత్ ప్లాంట్ కు సరఫరా చేసినా చర్యలు లేవని, బొగ్గుసరఫరా చేసిన వారికి సంవత్సరం ఆలస్యంగా చెల్లింపులు చేస్తూ, బొగ్గును ఎక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారని ఆయన అన్నారు. అదానీకి మాత్రం ఇందుకు భిన్నంగా నెలవారీ చెల్లింపులకు బ్యాంకుల ద్వారా ఎల్సీ ఇస్తున్నారని, భూములిచ్చి నిర్వాసితుల ప్రయోజనాలు గాలికొదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Dowry Harassment: పెళ్లై రెండు నెలలు తిరగకముందే.. వరకట్న వేధింపులకు నవ వధువు బలి!
- Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు!
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
తాజావార్తలు
-
Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
-
Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
-
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్‌కు కీలక సమరం!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?