NTV Telugu Site icon

Minister Atchannaidu: కౌలు రైతుల రుణాలపై సమీక్ష.. లోన్స్ మంజూరుపై చర్చ

Atchnaidu

Atchnaidu

Minister Atchannaidu: అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్‍లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఈ ఎస్ఎల్బీసీ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, డ్వాక్రా సంఘాలకు సహా వివిధ వర్గాలకు బ్యాంకర్లు అందించాల్సిన రుణాలపై సమీక్షించారు. ఇక, ప్రభుత్వం ప్రకటిస్తున్న పాలసీలకు బ్యాంకర్ల సహకారం అవసరమని మంత్రి చెప్పుకొచ్చారు. ముద్ర, PMGP, వ్యవసాయ, పారిశ్రామిక రుణాలపై ప్రధానంగా చర్చించారు.

Read Also: IND vs NZ: బెంబేలెత్తిపోయిన బ్యాటర్లు.. భారత్ స్కోరు 34/6! నలుగురు డకౌట్

ఇక, కౌలు రైతులకు రుణాల మంజూరులో ప్రత్యేకంగా కృషి చేయాలనే కోణంలో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాయితీ రుణాల మంజూరుపై చర్చించారు. కౌలు రైతుల రుణాలపై ప్రత్యేకంగా డిస్కషన్ చేశారు. ఇక, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కౌలు రైతులు ఉన్నారని అధికారులు చెప్పుకొచ్చారు. సిబిల్ స్కోరును ప్రత్యేకంగా చర్చించకుండా రుణాలు మంజూరు చేయాలని కోరారు. వచ్చే 15 రోజుల్లో రుణాల మంజూరుపై ఒక నిర్ణయం తీసుకుంటామని SLBC లీడ్ బ్యాంక్ గా ఉన్న యూనియన్ బ్యాంక్ జీఎం తెలిపారు.

Read Also: Spurious Liquor: కల్తీ మద్యం ఘటన.. 25కి చేరిన మృతుల సంఖ్య!

అయితే, వచ్చే SLBC నాటికి రైతుల రుణాలపై ఒక నిర్ణయానికి రావాలని అధికారులు తెలిపారు. సిబిల్ కు పంపిన డేటాలో తప్పులున్నాయని చాలా కంప్లైంట్ లు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. కాకినాడ, మచిలీపట్నంలలో కిసాన్ క్రెడిట్ కార్డు ఇవ్వడం ద్వారా సిబిల్ కష్టాలను దాదాపు దూరం చేసామన్నారు. జిల్లా స్ధాయిలో రుణాల మంజూరు విషయంలో టార్గెట్లు ఇంకా పూర్తి చేయాల్సి‌‌ ఉందన్నారు.. కౌలు రైతుల అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.. ఆర్బీఐ ULI విధానం త్వరలో అమలులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు.