Minister Atchannaidu: కౌలు రైతుల రుణాలపై సమీక్ష.. లోన్స్ మంజూరుపై చర్చ
- సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన SLBC సమావేశం..
- హాజరైన వివిధ శాఖల ఉన్నతాధికారులు.. బ్యాంకర్లు
- కౌలు రైతు రుణాలపై సమావేశంలో ప్రత్యేక సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్‍లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఈ ఎస్ఎల్బీసీ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు, డ్వాక్రా సంఘాలకు సహా వివిధ వర్గాలకు బ్యాంకర్లు అందించాల్సిన రుణాలపై సమీక్షించారు. ఇక, ప్రభుత్వం ప్రకటిస్తున్న పాలసీలకు బ్యాంకర్ల సహకారం అవసరమని మంత్రి చెప్పుకొచ్చారు. ముద్ర, PMGP, వ్యవసాయ, పారిశ్రామిక రుణాలపై ప్రధానంగా చర్చించారు.
Read Also: IND vs NZ: బెంబేలెత్తిపోయిన బ్యాటర్లు.. భారత్ స్కోరు 34/6! నలుగురు డకౌట్
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
ఇక, కౌలు రైతులకు రుణాల మంజూరులో ప్రత్యేకంగా కృషి చేయాలనే కోణంలో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాయితీ రుణాల మంజూరుపై చర్చించారు. కౌలు రైతుల రుణాలపై ప్రత్యేకంగా డిస్కషన్ చేశారు. ఇక, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కౌలు రైతులు ఉన్నారని అధికారులు చెప్పుకొచ్చారు. సిబిల్ స్కోరును ప్రత్యేకంగా చర్చించకుండా రుణాలు మంజూరు చేయాలని కోరారు. వచ్చే 15 రోజుల్లో రుణాల మంజూరుపై ఒక నిర్ణయం తీసుకుంటామని SLBC లీడ్ బ్యాంక్ గా ఉన్న యూనియన్ బ్యాంక్ జీఎం తెలిపారు.
Read Also: Spurious Liquor: కల్తీ మద్యం ఘటన.. 25కి చేరిన మృతుల సంఖ్య!
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 228వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి ప్రత్యేకత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని అవకాశాలు ఉన్నాయి.. గత ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి.. ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిందని ఆరోపించారు. గత ఐదేళ్ళలో ఆగిపోయిన సంక్షేమం, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడమే మా ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సుదీర్ఘమైన తీర ప్రాంతం, కష్టపడి పని చేసే యువత ఏపీకి ఉన్న అదృష్టం.. ప్రధాని అత్యంత అద్భుతమైన స్కీంలు పెట్టి.. బ్యాంకులకు టార్గెట్లు ఇస్తున్నారు.. బ్యాంకులు టార్గెట్లు పూర్తి చేయకుండా.. ఇలా సమావేశాలు పెట్టుకోవడమే సరిపోతుంది.. ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి కనుక్కుంటున్నా ఇంకా ఏదీ ముందుకు వెళ్ళడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!