CM Jagan: మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి.. బ్యాంకర్లకు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలో 219వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2022–23 వార్షిక రుణ ప్రణాళికను ఎస్ఎల్బీసీ వెల్లడించింది. ఇందులో 51.56 శాతం వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు కేటాయించినట్లు ఎస్ఎల్బీసీ తెలిపింది.
కాగా 2021-22లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53 శాతమే రుణాలు అందాయని ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం జగన్ వెల్లడించారు. వీరికి రుణాలు అందించడంపై బ్యాంకర్లు మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు. సాగుచేస్తున్న కౌలు రైతుల్ని సులభంగా ఈ డేటా ద్వారా గుర్తించవచ్చని.. ఈ-డేటాను పరిగణలోకి తీసుకుని వారికి విరివిగా రుణాలు ఇచ్చి బ్యాంకర్లు అండగా నిలవాలని హితవు పలికారు. 2021-22లో ఎంఎస్ఎంఈలకు 90.55 శాతం రుణాలు ఇచ్చారని సీఎం జగన్ తెలిపారు. ఈ రంగంలో కూడా లక్ష్యం కంటే తక్కువగా రుణాలు ఇచ్చారని.. టిడ్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులతో బ్యాంకులు టైఅప్ కావాల్సి ఉందన్నారు.ఈ అంశంపై బ్యాంకులు దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు.
Also Read
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
- CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
మహిళలపై వడ్డీ భారాన్ని తగ్గించేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. వార్షిక రుణ ప్రణాళిక తయారీలో ప్రభుత్వాధికారుల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్దేశించుకున్న అంశాలకు వార్షిక ప్రణాళికలో చోటు దక్కతుందని తెలిపారు. ఆర్బీకేల్లో డ్రోన్లను తీసుకు వస్తున్నామని.. డ్రోన్ టెక్నాలజీకి బ్యాంకర్లు సహకారం అందించాలని సీఎం జగన్ కోరారు.
తాజావార్తలు
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
-
DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
-
Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
-
Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!