Tractor overturned: పెళ్లికి వెళుతున్న పెళ్లి బృందం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు ట్రాక్టర్ లో బయలుదేరారు. కానీ వారికి మృత్యువు కాటేసింది. ట్రాక్టర్ అనుకోని విధంగా ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ బోల్తాపడటంతో అక్కడికక్కడే ఆరుగురు చనిపోయారు. మృతుల్లే ఇద్దరు చిన్నారు ఉండటం అందరిని కలిచివేసింది. చిత్తూరు జిల్లాలో ఈ విషాధమైన ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరుకు చెందిన పెళ్లి బృందం 26 మంది బలిజపల్లి గ్రామస్థులు పెళ్లికి వెల్లేందుకు ట్రాక్టర్ లో బయలుదేరింది.
Read also: Tamil Nadu: ఉదయనిధి స్టాలిన్ “ప్లేబాయ్”గానే మిగిలిపోతాడు.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
అయితే ట్రాక్టర్ అంతమంది ఎక్కువ ఉండటంతో లేక ఒకవైపే అందరూ ఉండతోనే ఇలా జరిగిందో తెలియదు కానీ ట్రాక్టర్ క్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే ఆరుగురు చనిపోగా మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడు నవ్వుతూ వున్న వారు వారి కళ్లముందే ప్రాణాలు వదలడంతో పెళ్లి బృందంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్డు రక్తమోరడంతో ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానిక సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్, వేలూరు సీఎంసీకి తరలించారు. మృతులు ఐరాల మండలం బలిజపల్లికి చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.