ప్లాస్టిక్ నిరోధానికి మూలాలపై దృష్టి పెట్టాలి.. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్లాస్టిక్ వినియోగంపై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ప్లాస్టిక్ వల్ల వచ్చే కాలుష్యం పై వివరించారు.. ప్లాస్టిక్ ఉత్పత్తులు అరికట్టాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం.. సచివాలయం మొత్తం ప్లాస్టిక్ నిలిపి వేశాం.. గాజు సీసాల్లో సచివాలయంలో నీటి సౌకర్యం ఏర్పాటు చేశాం అన్నారు.
పాస్టిక్ నిషేధంపై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ సచివాలయంలో ఈనెల 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నాం అన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్. వచ్చే ఏడాది జూన్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు.
Cow and Calf Death in nandyal: ప్లాస్టిక్ వాడకం మనుషులకు మాత్రమే కాదు ఇతర జంతువులు, జీవ రాశులకు కూడా పెను ప్రమాదంగా మారుతుంది. ఇప్పటికే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నా చాలా మందిలో ఈ విషయం మీద ఇంకా అవగాహన రావడం లేదు. బయటకు వెళ్లేటప్పుడు గుడ్డతో కుట్టిన చేతి సంచులు తీసుకు వెళ్ళాలి, ఆ సంచులు చాలా రోజుల పాటు పారేయకుండా వాడాలి…
ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్‌ను సవరించింది.. కాలుష్యాన్ని సృష్టించే వారే ఈ వ్యయాన్ని భరించాలన్న థియరీ ఆధారంగా పెనాల్టీలు వేసేందుకు నిర్ణయం ఈసుకుంది.. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించనున్నట్టు పేర్కొంది.. పాలిథీన్ క్యారీబ్యాగులు ఉత్పత్తి, విక్రయాలపైనా, ఈ కామర్సు కంపెనీల పైనా దృష్టి పెట్టాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. మున్సిపల్…
Plastic Ban: విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. విశాఖలో శుక్రవారం నిర్వహించిన ‘సాగర తీర స్వచ్ఛత’ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర తీరంలో 20వేల మందితో 28కి.మీ. మేర బీచ్ క్లీనింగ్ చేపట్టి 76 టన్నుల ప్లాస్టిక్‌ను తొలగించామని తెలిపారు. అటు ఏపీలో ఈరోజు నుంచే ప్లాస్టిక్ బ్యానర్లు రద్దు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఇకపై క్లాత్ బ్యానర్లు మాత్రమే కనిపించాలని సూచించారు. విశాఖ…