Site icon NTV Telugu

Gidugu Rudra Raju: రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం రాబోతుంది

Gidugu Rudraraju

Gidugu Rudraraju

ఏపీలో జరగబోయే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని సమాయత్వం చేస్తున్నారు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో వివిధ సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. యూపిఏ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకి చెప్పాలని కార్యక్రామాలు చేపడుతున్నాం..గ్రామీణ ఉపాధి హామీ, ఫుడ్ సెక్యూరిటీ, రైట్ టూ ఎడ్యకేషన్, రైట్ టూ ఇన్ఫర్మేషన్ వంటి పథకాలు చేపట్టాం..ఇక్కడున్న గిరిజన ప్రాంతాలలో ఉన్న ఆదివాసీయుల చట్టలు కాపాడేలా ..1/70 చట్టలను కాంగ్రెస్ పార్టీనే చేసింది.

Read Also:Rajasthan Minister: రాజస్థాన్‌ మంత్రిపై కేసు నమోదు.. ముఖ్యమంత్రిపై మండిపాటు

వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచుల హక్కులను కాల రాస్తుందు ఈ ప్రభుత్వం. సచివాలయం ఉద్యోగులు గవర్నర్ ను కలిసి తమకు సెక్యూరిటీ లేదని చెబుతున్నారు…. చెత్తపై పను వేస్తున్నారు.. కరెంటు చార్జ్ లు పెచ్చి ప్రజలపై ఈ ప్రభుత్వం భారం మోపుతుంది.బీజేపీ అయితే మత, కుల, ప్రాంతాల పేరుతో రెచ్చగొడుతు పాలిస్తుంది…రాష్ట్రంలో నడుస్తున్న పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవే.. ప్రత్యేక హోదా ఇవ్వగల పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీనే… దీనిని ప్రజలకు వివరిస్తాం అన్నారు గిడుగు రుద్రరాజు. భారత్ జోడో యాత్రలో భాగంగా చెయ్యి చెయ్యి కలుపుదాం రాహుల్ గాంధీని బలపరుద్దాం అంటు ర్యాలీ చేపట్టారు పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు.. రాజీవ్ విగ్రహం నుంచి బాలజీ జంక్షన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. హాజరైన జిల్లా నాయకులు కార్యకర్తల నుద్దేశించి ఆయన మాట్లాడారు.

Read Also: Wasim Jaffer: రోహిత్, కోహ్లీ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడరు: జాఫర్

Exit mobile version