సాధారణంగా శివలింగానికి ఏ తాళ్లు కట్టరు. శివలింగం అంటే ఎంతో పవిత్రంగా చూడడం మన సంప్రదాయం. కానీ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ గోలింగేశ్వరస్వామి ఆలయంలో శివలింగానికి అపచారం జరిగింది. ఆలయ పార్కింగ్ ప్రదేశంలో నిన్న వై.ఎస్.ఆర్ చేయూత పంపిణీ సభ నిర్వహించారు అధికారులు, వైసీపీ నేతలు. సభ కోసం వేసిన షామియానాకు సంబంధించిన రెండు తాళ్లను ఆలయం లోపల ఉన్న శివలింగానికి కట్టేశారు. తెలిసి చేశారో… తెలియక చేశారో తెలీదు గానీ సిబ్బంది చేసిన పనిపై భక్తులు మండిపడుతున్నారు.
Read Also: Kishan Reddy: మోడీని తప్పు పట్టే విధానాలను పక్కన పెట్టి.. తెలంగాణ సంగతి చూడండి
వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన సభ బ్రహ్మాండంగా నిర్వహించారు కానీ… సభ పేరుతో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. శివలింగానికి షామియానా తాళ్లు కట్టిన వీడియోసొషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సభ పేరుతో శివలింగానికి అపచారం చేసిన వారిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షామియానా తాళ్లు కట్టడానికి సమీపంలోని కర్రలు ఏవైనా ఉపయోగించాలి గానీ ఇలా శివలింగానికి తాళ్లు కట్టడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. ఈ గోలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర వుంది. భారతదేశంలో కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు రెండుచోట్ల మాత్రమే ఉన్నాయి. ఒకటి దక్షిణ దేశంలోని ‘ఫలణి’లోను రెండవది బిరుదాంకపురంలో వెలిశారు. మరి బిక్కవోలు ఆలయంలో జరిగిన అపచారానికి అధికారులు ఏం సమాధానం చెబుతారో చూడాలి.
Read Also: Minister RK Roja: రైతుల పేరుతో ఎందుకీ దొంగయాత్రలు బాబూ!