ఏపీలో రేపట్నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతబడిన స్కూళ్లు.. మళ్లీ తెరుచుకోనున్నాయి. దీనికోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అయితే, పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు మాత్రం భయపడుతున్నారు. దీంతో, గుంటూరు జిల్లాలో స్కూల్స్ ఓపెనింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తి కరోనా నిబంధలు పాటిస్తామని చెబుతున్నారు. అయితే కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్నవేళ.. స్కూల్స్ తెరవకపోవడమే బెటరంటున్నారు విద్యార్థుల తల్లితండ్రులు.
Read Also : “భీమ్లా నాయక్” వచ్చేశాడు… పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్
ఓ వైపు డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు భయపెడుతుంటే.. ఏపీలో పాఠశాలలు ప్రారంభించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పాజిటివ్ వస్తే.. తాము భరించలేమని చెబుతున్నారు. వారికేమైనా జరిగితే పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. రేపట్నుంచి నుంచి స్కూల్స్ ఓపెనవుతున్నా, చిన్నారులను పంపే విషయంలో తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్‌కు పంపిస్తే, ఎక్కడ రాకాసి కరోనా సోకుతుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు, థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. డిల్లీ ఎయిమ్స్‌కి చెంది నిపుణులు హెచ్చరించారు. దీంతో, పిల్లల్ని పాఠశాలలకు పంపాలంటేనే పేరెంట్స్ భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ ఎలా తీస్తారంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులే కొనసాగించాలనీ తల్లిదండ్రులు చెబుతుంటే.. ప్రత్యక్ష తరగతుల్నిఎక్కువకాలం వాయిదా వేస్తే పిల్లలకు అకాడమిక్ ఇయర్ లాసవుతుందని ప్రభుత్వం చెబుతోంది.