Sariya water Fall: మృత్యుకుహరంగా సరియా వాటర్ పాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లూరిసీతారామరాజు జిల్లాలో జలపాతాలు పర్యాటకులకు ఒకవైపు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుంటే అక్కడికి వెళ్ళినవారు మరణించడంతో విషాదం నెలకొంటోంది. సరియా జలపాతం టూరిస్టుల పాలిట మృత్యుకుహరంగా మారింది. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని సరియా జలపాతం ప్రమాదభరితంగా మారింది. మంగళవారం సరియా జలపాతానికి విహారానికి వచ్చిన విశాఖకు చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
వారి మృతదేహాలను అనంతగిరి పోలీసులు ఎట్టకేలకు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. విశాఖ జగదాంబ సమీపంలోని ఎల్లమ్మతోట ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు మంగళవారం సరియా జలపాతం సందర్శించేందుకు వచ్చారు. వారిలోదుక్కసాయి 39 ప్రమాదవశాత్తూ జలపాతంలో జారిపడగా తనను రక్షించే ప్రయత్నంలో చైతన్య అనే 17 ఏళ్ళ యువకుడు కూడా అందరి కళ్లముందే గల్లంతయ్యాడు. దీంతో ఆందోళనకు గురైన మిగిలిన ఇద్దరు స్నేహితులు సమీపంలోని దేవరాపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా రాత్రి సమయం కావడంతో ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదు.
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
బుధవారం వేకువ జామున అనంతగిరి పోలీసులు గజ ఈతగాళ్లుతో మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను ఒడ్డుకుచేర్చి, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సరియా జలపాతంపై పోలీసులు స్థానికులు పలు హెచ్చరికలు సూచనలు చేస్తున్నప్పటికీ తరచూ పర్యాటకులు జలపాతంలో మృత్యువాతకు గురవుతున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినప్పటికీ పర్యాటకులు వాటిని పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు గురై వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచుతున్నారు.
ఇప్పటికే సరియా జలపాతంలో పదులసంఖ్యలో పర్యాటకులు మృత్యువాతకు గురయ్యారు. ముఖ్యంగా యువకులే ఈప్రమాదంలో ఎక్కువగా చనిపోతున్నారు. కావున ఇప్పటికైనా తల్లిదండ్రులు వారి పిల్లలను సరియా జలపాతాన్ని సందర్శనకు పంపించే విషయంలో తగుజాగ్రత్తలు తీసుకుంటే జలపాతంలో ప్రమాదాలను నివారించవచ్చు. ఈప్రమాదంలో చనిపోయిన సాయికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశాఖలో చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడు. చైతన్య ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
Dsp Died: శిల్పకళావేదికలో అపశృతి.. డిఎస్పీ క్యాడర్ అధికారి దుర్మరణం
తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!