ఎనిమిదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా వారికి ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపు సీఎం వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేసే కార్యక్రమానికి శ్రీకారంట చుట్టనున్నారు.. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం జగన్.
అల్లూరిసీతారామరాజు జిల్లాలో జలపాతాలు పర్యాటకులకు ఒకవైపు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుంటే అక్కడికి వెళ్ళినవారు మరణించడంతో విషాదం నెలకొంటోంది. సరియా జలపాతం టూరిస్టుల పాలిట మృత్యుకుహరంగా మారింది. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని సరియా జలపాతం ప్రమాదభరితంగా మారింది. మంగళవారం సరియా జలపాతానికి విహారానికి వచ్చిన విశాఖకు చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారి మృతదేహాలను అనంతగిరి పోలీసులు ఎట్టకేలకు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. విశాఖ జగదాంబ సమీపంలోని ఎల్లమ్మతోట ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు మంగళవారం సరియా…