పేరుకే చారిత్రకనగరం.. కానీ అక్కడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు ముందు చూపు కొరవడింది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో రాజమండ్రి నగరం ముంపునకు గురౌతుంది. అక్కడ వర్షం వస్తే చాలు నగరం చిత్తడవుతుంది. వేసవిలో చేపట్టవలసిన డ్రైనేజీల్లో పూడికతీత పనులు ఆలస్యంగా చేపట్టి , వర్షాలు పడటంతో ఉరుకులు పరుగులు తీస్తున్నారు అధికారులు, కార్పోరేషన్ సిబ్బంది. వర్షాలు పడుతుండడంతో అంటువ్యాధుల భయం జనాన్ని పీడిస్తోంది.
చారిత్రక నగరం రాజమహేంద్రవరం చెత్తా చెదారం పెరిగి ముంపుతో కంపుకొడుతుంది. రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో ప్రతిఏటా వేసవిలో డ్రైనేజీల్లో పూడిక తీత పనులను చేపట్టేవారు. కానీ ఈ ఏడాది ఆ పనులేం కనిపించలేదు. ఈనెల15వ తేదీ తరువాత నుండి పూడికతీత పనులను చేపట్టారు. ఇప్పటికే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీల్లో మురికి నీరు పొంగిపొర్లుతూ రోడ్లుపై ప్రవహిస్తోంది. చిన్నపాటి చినుకులకే పలు ప్రాంతాల్లో రోడ్లుచెరువులను తలపిస్తున్నాయి.
హైటెక్ బస్టాండ్, రైల్వే స్టేషన్, అదెమ్మదిబ్బ, వి.ఎల్. పురం, మోరంపూడి.,..తదితర ప్రాంతాలు వర్షాలు వస్తే ముంపునకు గురౌతున్నాయి. వర్షం వస్తే చాలు ఈ ప్రాంతవాసులు భయపడి పోతున్నారు. వాహనాలు మొరాయించి మరమ్మతులకు గురౌతున్నాయి. వర్షాలు పడటంతో మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. క్లీన్ రాజమండ్రి పేరుతో శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితోపాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తలు డ్రైవ్ లోపాల్గొని డ్రైనేజీలు శుభ్రపర్చే కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. రోజుకు మూడు డివిజన్లు చొప్పున 16 రోజుల్లోనే రాజమండ్రి అంతా శానిటేషన్ పనులు పూర్తి చేయడానికి కార్యాచరణ చేపట్టారు. ఈ కార్యక్రమాలను ఎంపీ మార్గాని భరత్, ఇతర ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు.
Ponds Controversy: ఎండపల్లిలో చెరువుల వివాదం .. టెన్షన్ టెన్షన్