NTV Telugu Site icon

చంద్రబాబు వస్తే అంతా ప్రశాంతంగా ఉంటుందట : సజ్జల

ఏపీలో మరోసారి టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణ విముక్తి విషయంలో ఏమి జరిగిందో, లక్ష కోట్లు 20 వేల కోట్లు ఎలా అయ్యాయో అందరికీ తెలుసునని అన్నారు. అంతేకాకుండా మీడియా ముసుగులో దశబ్దాలు తరబడి టీడీపీ కోసం రౌడీయిజం, రుబాబు చేస్తున్నారని, చంద్రబాబు వస్తే అంతా ప్రశాంతంగా ఉంటుంది అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు.

జగన్మోహన్ రెడ్డి పథకాలను రోజూ విమర్శించండి తప్పులేదు…కానీ ఆధారాలుండాలని, పేదలు సొంత కాళ్ళమీద నిలబడకూడదు అనేదే చంద్రబాబు ఆలోచన అని ఆయన మండిపడ్డారు. ‘ఉంటే చంద్రబాబు ఉండాలి…లేదంటే రాష్ట్రం నాశనం కావాలి అనేది ఆ పత్రికల భావన. ప్రజలు వీళ్ళని చెత్తబుట్టలో పడేయాల్సిన అవసరం ఉంది. అవి ప్రచార సాధనాలు కాదు… విష ప్రచార సాధనాలు. వాళ్ళు చేసిన అడ్డగోలు దోపిడీకి దాడులు చేస్తే ఇందులో కక్షపూరితం ఎక్కడుంది. వైజాగ్ స్టీల్ కేంద్ర ప్రభుత్వానిది… మనకు దానితో చరిత్రాత్మక బంధం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సలహాలు కూడా ఇచ్చింది’ అంటూ ఆయన వెల్లడించారు.