NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: 24 వేల కోట్లకు కేబినెట్ ఆమోద ముద్ర.. చంద్రబాబుకి కడుపు మంట

Sajjala Fires On Chandrabab

Sajjala Fires On Chandrabab

Sajjala Ramakrishna Reddy Says Chandrababu Not Happy With AP Development: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వదరలా ఒకేసారి వస్తున్నాయని, ఇది సంతోషకరమైన విషయమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. 24 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. అయితే.. వీటిని చూసి చంద్రబాబుకు, ఆయన మీడియాకు కడుపు మంటగా ఉందని విమర్శించారు. రివర్స్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను పరిశ్రమల కింద పరిగణించారని వివరించారు. ఈ విషయంలో రహస్యం ఏమీ లేదని స్పష్టం చేసిన ఆయన.. అదానీలు, షిర్డీలు తమకేదో బంధువులైనట్లు, అవినీతి జరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Rishabh Pant: చరిత్ర సృష్టించిన పంత్.. ఆ రికార్డ్ సాధించిన తొలి క్రికెటర్

రాష్ట్రం బాగు పడాలని ఆలోచించే వ్యక్తి జగన్ అని.. కానీ చంద్రబాబుది మాత్రం బరితెగింపు వ్యవహార శైలి అని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కడప స్టీల్ ప్లాంట్‌ను ఎందుకు కట్టలేక పోయారు? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తాము ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఒక పరిశ్రమను తీసుకొచ్చామని, దాన్ని కూడా వెటకారం చేస్తున్నారని ఆగ్రహించారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే.. జగన్ హయాంలో పరిశ్రమలు రాకూడదని వారి కోరిక అన్నట్టుగా స్పష్టమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ అర్జెంటుగా దిగిపోవాలి, చంద్రబాబు అధికారంలోకి వచ్చేయాలి.. ఈ రెండు జరిగితే.. వీళ్ళకు అంతా ప్రశాంతంగా కనిపిస్తుందని చెప్పారు.

India-China Clash Video: తరిమి తరిమికొట్టిన భారత జవాన్లు.. వీడియో వైరల్

గతంలో రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు సమయానికి వేసేవారు కాదని.. మిగిలిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు సైతం ఆలస్యంగానే వచ్చేవని సజ్జల అన్నారు. కానీ, తమ వైసీపీ ప్రభుత్వం మాత్రం అందరికీ ఒకేసారి జీతాల చెల్లింపులు చేయాలన్న ప్రయత్నం చేస్తోందని, దాని వల్లే ఆలస్యం అవుతోందని చెప్పారు. మొత్తం జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో 70 శాతం వరకు 1, 2 తేదీల్లోనే జమ అవుతున్నాయన్నారు. మిగిలిన 30 శాతం చెల్లింపులే ఆలస్యం అవుతున్నాయని స్పష్టం చేశారు. ఈ నెలలో ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. ఇకపై ఆలస్యం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సంక్రాంతి నాటికి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని అన్నారు.

Nandamuri Balakrishna: బాలయ్య.. మజాకానా.. ప్రభాస్ తో కూడా ఆ పని చేయించేశాడు..

అంతకుముందు కూడా చంద్రబాబుపై సజ్జల ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని, వైసీపీ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని అన్నారు. ఏపీలో 90శాతం మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మంచి పాలనకు నిదర్శనం సీఎం జగన్‌ అని చెప్పారు. రాజకీయ నేత ఎలా ఉండకూడదో చెప్పేందుకు చంద్రబాబే ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియా ద్వారా ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైద్య రంగానికి సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.