NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: కేసీఆర్‌ జాతీయ పార్టీపై స్పందించిన సజ్జల.. మేం క్లియర్‌..

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధం అయ్యారు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌… ఈ దసరా రోజే కొత్త పార్టీ జెండా, అజెండా ప్రకటించేందుకు సన్నద్ధం అయ్యారని తెలుస్తోంది.. ఇక, దేశవ్యాప్తంగా విస్తృత్తంగా పర్యటించేందుకు ఏకంగా ప్రత్యేక విమానాన్ని కూడా కొనుగోలు చేయనుందట టీఆర్ఎస్‌ పార్టీ.. ఇదే సమయంలో.. థర్డ్‌ ఫ్రంట్‌పై కూడా చర్చ సాగుతోంది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… థర్డ్‌ ఫ్రంట్‌, కేసీఆర్‌ జాతీయ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. మాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం.. ఏ ఫ్రంట్‌లోనూ వైసీపీ చేరదు అని స్పష్టం చేశారు.. ఇక, వైసీపీ ఏ ఫ్రంట్‌లో చేరుతుందనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్న ఆయన.. ఎవరూ మిమ్మల్ని సంప్రదించ లేదన్నారు.

Read Also: Liquor Sales: లిక్కర్‌కు దసరా కిక్కు.. ముందుగానే జోరుగా అమ్మకాలు..

మరోవైపు.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తెలంగాణ మంత్రులపై కూడా స్పందించారు సజ్జల.. మేం ఎప్పుడూ తెలంగాణపై విమర్శలు చేయలేదన్న ఆయన.. తెలంగాణలో మంత్రిగా ఉన్న హరీష్‌రావుకు వేరే రాష్ట్రంపై కామెంట్ చేయాల్సిన అవసరం లేదని హితవుపలికారు.. హరీష్ రావుకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు అంటూ సెటైర్లు వేసిన ఆయన.. మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై వ్యాఖ్యలు చేసి తద్వారా మా చేత కేసీఆర్‌ను తిట్టించాలి అనుకుంటున్నారేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కాగా, ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చీటర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై హరీష్‌రావు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.