Site icon NTV Telugu

Sajjala Ramakrishna Reddy: అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు..

Sajjala

Sajjala

Sajjala Ramakrishna Reddy: జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం ఎలా దెబ్బ తీస్తుందనేది వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. చంద్రబాబు రాయలసీమ ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదు.. జగన్ అమరావతిపై పలు ప్రశ్నలు సంధించారు.. రాజధాని నిర్మాణం కోసం తొలిదశ 50 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏమీ చేయలేదు.. ముందు ఇచ్చిన రైతులకు ఏమీ చేయకుండా రెండవ దశకు వెళ్ళటం తప్పు కదా అని ప్రశ్నించారు.. రైతులకు ఇస్తున్న రిటర్న్ ఫ్లాట్స్ కు కనీస మౌలిక సదుపాయాలు కల్పన లేదని సజ్జల అన్నారు.

Read Also: Shoaib Akhtar: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ గేమ్ ఛేంజర్‌ ఆ ప్లేయరే.. షోయబ్ అక్తర్ జోష్యం

ఇక, ఫ్లాట్స్ దగ్గరకు వెళ్ళటానికి కనీసం రోడ్లు కూడా లేవని వైసీపీ నేత సజ్జల పేర్కొన్నారు. 2019లో జగన్ ఇదే ప్రశ్నలు లేవనెత్తారు.. 50 ఎకరాల్లో అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్లు కావాలి.. ఇది అప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు అని చెప్పారు.. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు సేకరణ చేస్తున్నారు.. అప్పుడు మొత్తం రెండు లక్షల కోట్లు కావాలి అన్నారు. ప్రయారిటీ ప్రకారం రైతులకు న్యాయం చేయట్లేదు.. 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయ భవనాలు అంటున్నారు.. తెలంగాణ అసెంబ్లీ కూడా 10 లక్షల చదరపు అడుగులు.. పార్లమెంట్ 7 ఏడు లక్షల చదరపు అడుగులు.. ఒక్కొక్క స్క్వేర్ ఫీటుకు 12 వేల వరకు ఇస్తున్నారని రామకృష్ణారెడ్డి తెలిపారు.

Read Also: ISRO: రేపే PSLV-C62 రాకెట్ ప్రయోగం.. చెంగాళమ్మ పరమేశ్వరి దేవికి ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు..

అయితే, అమరావతి పేరు చెప్పి తన వాళ్లకి దోచిపెడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రైతుల బాధలు పట్టించుకోకుండా మిగతా అన్నీ ఎందుకు అడుగుతున్నాం.. రాయలసీమ లిఫ్ట్ గురించి అడిగితే సమాధానాలు లేవు.. కానీ, అమరావతిపై రైతుల పక్షాన మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్.. జగన్ అమరావతి లో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు.. చంద్రబాబు పదేళ్ల తర్వాత ఇప్పుడు ఇల్లు మొదలుపెట్టారు.. డీ సెంట్రలైజ్ అని చెప్పినప్పుడు కూడా అమరావతి ని వదిలిపెట్టలేదు.. కావాలనే జగన్ మాటలను ఇష్టానుసారం వక్రీకరిస్తున్నారని తెలిపారు.

Read Also: Chhattisgarh: దగ్గర పడుతున్న డెడ్‌లైన్.. 63 మంది మావోలు లొంగుబాటు

కాగా, అమరావతి రైతులే మమ్మల్ని మళ్లీ ముంచుతున్నారని చెప్పుకుంటున్నారని రామకృష్ణారెడ్డి తెలిపారు. అమరావతి టెండర్లలో కూడా కొద్ది కంపెనీలకే ప్రాధాన్యం.. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీలకే టెండర్లు ఇచ్చారు.. కచ్చితంగా జరుగుతున్న పరిణామాలపై నిలదీశారు.. చంద్రబాబు రాజధాని అన్నప్పుడు కూడా ప్రభుత్వ స్థలాలు తీసుకుని చేయమని చెప్పారు.. పదేళ్లు హైదరాబాద్ లో ఉండే అవకాశం ఉన్నా పరిగెత్తుకొని వచ్చేశారు.. మీరు చేసిన తప్పుడు పనికి దొరికిపోయి భయపడి వచ్చేశారు.. ఎవరూ లేని చోట రాజధాని అన్నారు.. వైజాగ్ అయితే వేగంగా పెరుగుతుందని వెళ్లాలి అన్నారు తప్ప మరో కారణం లేదు.. వైజాగ్ గ్రోత్ ఇంజిన్ అని జగన్ అన్నారు.. మీరు కూడా వైజాగ్ లో పనులు చేస్తున్నారు కదా అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

Exit mobile version