ISRO: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్, ఇతర శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల12న ఉదయం10 గంటల 19 నిమిషాలకు పీఎస్ఎల్వీ రాకెట్ ను ప్రయోగిస్తున్నాం.. ఈ ఏడాదిలో ఇదే మొదటి ప్రయోగం.. ఈ రాకెట్ ద్వారా భూ పరిశీలన కోసం ఈఓఎస్-N1 ఉపగ్రహంతో పాటు వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మైక్రో శాటిలైట్ లను కూడా ప్రయోగిస్తున్నామని వెల్లడించారు. గత ఏడాది పీఎస్ఎల్వి ప్రయోగంలో కొంత అవరోధం ఏర్పడింది అని ఇస్రో చీఫ్ నారాయణన్ పేర్కొన్నారు.
Read Also: MSVG: తెలంగాణలో చిరంజీవి సినిమా టికెట్ల ధరలు పెంపు.. ప్రీమియర్ షోపై ప్రభుత్వం క్లారిటీ!
అయితే, ఈసారి వాటిని అధిగమించి ప్రయోగాన్ని చేపట్టం అని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ తెలిపారు. ఈ ప్రయోగంతో 34 దేశాలకు చెందిన 442 ఉపగ్రహాలను మన దేశం నుంచి ప్రయోగించినట్లు అవుతుంది అని పేర్కొన్నారు. ఈ ప్రయోగానికి రేపు ఉదయం 12 గంటల 19 నిముషాలకు కౌంట్ డౌన్ మొదలు అవుతుందని చెప్పారు.