Rk Roja: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చుట్టేస్తూ.. తన అభిమాన సంఘాలనే కాకుండా ప్రజలను కూడా తనదైన మాటతీరుతో ఆకట్టుకోవడమే కాకుండా సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక నిన్నటికి నిన్న గాజువాకలో జరిగిన సభలో జగన్ పై పవన్ మరోసారి దుమ్మెత్తిపోశారు. ” ఆస్తులు అమ్ముకునేందుకా ప్రజలు మిమ్మల్ని సీఎంగా ఎన్నుకున్నది. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూపిస్తాను.. “అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా భూమి పేలిపోవాలి.. అందులో రుషికొండ మునిగిపోవాలి.. అందులో జగన్ సమాధి కావాలి అని ఆవేశంగా మాట్లాడారు. ఇక ఈ మాటలకు మినిస్టర్ రోజా కౌంటర్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై రోజా తనదైన రీతిలో చెలరేగారు. పవన్ కళ్యాణ్ కు పిచ్చి పట్టిందని ఎర్రగడ్డ లో చేర్పించాలని తెలిపారు. జగన్ ను చూసి పవన్ కుళ్ళుకుంటున్నాడని.. అందుకే తట్టుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.
Upendra: వారి గురించి నీచంగా మాట్లాడిన ఉపేంద్రపై కేసు.. స్టే ఇచ్చిన కోర్టు
” పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే.. జగన్ గారి పై ఆయన కడుపుమంట, ఆయన జెలసీ ఎంత పెరిగిపోతుందో స్పష్టంగా అర్ధమవుతుంది. తనకన్నా చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారు.. రోజురోజుకు ప్రజల్లో అభిమానం పెరిగిపోతుంది. దేశంలో ఆయన క్రేజ్ ఎంత పెరుగుతుందో చూసి సహించలేని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడాడు అంటే.. భూమి పేలిపోవాలి.. అందులో రుషికొండ మునిగిపోవాలి.. అందులో జగన్ సమాధి కావాలి అని మాట్లాడు అంటే.. ఈయన కడుపుమంటతోనే గుండెలు పగిలేలా అరిచి అరిచి చచ్చిపోతాడేమో.. అని భయమేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఆరోగ్యశ్రీ కింద ఈ పవన్ కళ్యాణ్ ను కడుపుమంటల కళ్యాణ్ అనే ప్రోసిజర్ కింద ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కడుపుమంటను చల్లార్చామని కోరతాం.. అప్పటికి చల్లారాకపోతే హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో జాయిన్ చేయాలనీ కోరుతున్నాం” అంటూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ అరిచి అరిచి గుండె పగిలి చచ్చిపోతాడేమోనని భయమేస్తోంది! – రోజా#Roja #PawanKalyan #VarahiVijayaYatra #VarahiVijayaYatraPhase3 #Janasena #JanaSenaPorataYatra #RojaSelvamani #YSRCP #AndhraPradesh #YSRCP #NTVTelugu pic.twitter.com/RPmoLaO5XE
— NTV Telugu (@NtvTeluguLive) August 14, 2023
