Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కానీ వారికి మాత్రమే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని ఆర్ధిక శాఖ పేర్కొంది. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వేతనాలు తీసుకుంటున్న స్థానిక సంస్థలు, రాష్ట్ర సచివాలయం, శాసన పరిషత్ ఉద్యోగులు అధికారులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. న్యాయాధికారులు, గ్రామ అధికారులు మినహా 309 అధికరణ కింద నియమితులైన ఉద్యోగులు అధికారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Read Also:PayCM: బెంగళూరులో ‘పేసీఎం’ పోస్టర్ల వివాదం.. పలువురు కాంగ్రెస్ నేతల అరెస్ట్
Also Read
- Jyothula Nehru: ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లడంపై స్పందించిన జ్యోతుల నెహ్రూ.. ఆసక్తికర వ్యాఖ్యలు
- Heavy Rain Alert: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
- Uday Krishna Reddy: నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఆరోపణలు అన్నీ అవాస్తవం.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా!
- DSC irregularities: దమ్ముంటే చర్చకు రా.. మంత్రి లోకేష్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్!
కాగా 62 ఏళ్ల ఉద్యోగ విరమణ పెంపు వర్తిస్తుందంటూ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సంస్థలు, కంపెనీలు, సొసైటీలు, విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లో ఆదేశాలు ఇవ్వటంపై ఆర్ధిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అనుమతి, అధికారం లేకుండా ఆయా సంస్థలు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఎలాంటి అధికారిక ఉత్తర్వు లేకుండా ఉద్యోగ విరమణ పెంపు వర్తింప చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆర్ధికశాఖ తేల్చి చెప్పింది. ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ మెమో జారీ చేసింది. ఈ వ్యవహారంపై జరిగిన ఉల్లంఘనలపై నివేదిక పంపాలంటూ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. సెప్టెంబరు 30 తేదీలోగా ఆర్ధికశాఖకు నివేదికను పంపాలని కోరుతూ సర్కులర్ మోమో ఇచ్చింది.
తాజావార్తలు
-
Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
-
Heavy Rain Alert: కాసేపట్లో హైదరాబాద్‌లో కుండపోత.. అత్యవసరమైతేనే బయటకు రండి.!
-
Bihar: దారుణం.. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రేయసిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
-
PoK Protest: పీఓకేలో పాక్ సైన్యం అరాచకం.. కాల్పుల్లో 20 మంది ఉద్యమకారులు మృతి..
-
CM Revanth Reddy : ఏపీలో రూ.10 వేల కోట్ల బకాయిలు.. అక్కడ ఎందుకు ప్రశ్నించరు.?
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!