చిత్తూరు జిల్లాలో బ్లాక్ ప్యాడి వరి పై కన్నేసారు దుండగులు. పుంగనూరు(మం) బొడినాయుడు పల్లె గ్రామంలో బ్లాక్ ప్యాడి వరి (నల్లబియ్యం) కంకులు దొంగతనం చేసారు. అతి ఖరీదైన అరుదైన పంట ఈ నల్ల బియ్యం పంట కంకులను అర్ధరాత్రి కంకులు కోసుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు. బ్లాక్ పైడి బియ్యం మార్కెట్ విలువ కేజీ సుమారు 320రూ ఉంది. అయితే ఈ కొత్త పంట పై రైతులకు ఆసక్తి కోసం ఒకటిన్నర ఎకరాల్లో ఈ పంట వేసాడు రైతు వసంత్ కుమార్. దాదాపు రెండు క్వింటాళ్ల( వరి) బ్లాక్ ప్యాడి వరి కంకులను కోసుకెళ్లారు దుండగులు. అయితే ఈ దొంగతనం పోలీసులకు ఫిర్యాదు చేసారు.ఇక ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. అయితే ఈ బ్లాక్ పైడి పంటను పరిశీలించారు ఏఎస్ ఐ త్యాగరాజు, కానిస్టేబుల్.