Rapthadu Heat: టీడీపీ అధినేత చంద్రబాబుపై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొన్నిరోజులుగా హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అప్పట్లో మొద్దు శీనుకు ఒక్కమాట చెప్పుంటే చంద్రబాబును ఆయన ఇంట్లోకి దూరి చంపేసేవాడని తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు ముసలోడు అని.. రాష్ట్రానికి ఏం చేయలేడని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. పరుష పదజాలంతో నానా మాటలు అన్నారు. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ…