MLA Prakash Reddy: అనంతపురం రాజకీయాల్లో ఇప్పుడు ‘జాకీ’ పరిశ్రమ హీట్ పెంచుతుంది… ఈ విషయంపై తాజాగా సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ.. అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.. రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటు చేస్తే సుమారు 6000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని లేఖలో పేర్కొన్న రామకృష్ణ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రూ.10 కోట్లు డిమాండ్ చేయడంతో జాకీ పరిశ్రమ తరలిపోయినట్లు ఆరోపించారు.. పారిశ్రామికవేత్తలను ప్రజాప్రతినిధులు బెదిరిస్తే పరిశ్రమలు ఎలా ఏర్పాటు అవుతాయి? అని ప్రశ్నించారు రామకృష్ణ.. అయితే, ఆ ఆరోపణలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. చంద్రబాబు, రామకృష్ణ కళ్లున్న కాబోదులని ఫైర్ అయ్యారు.
Read Also: CM YS Jagan: సీఎం వైఎస్ జగన్‌కు లేఖ.. ఆ ఎమ్మెల్యే వల్లే ‘జాకీ’ పరిశ్రమ వెనక్కి..!
2018 డిసెంబర్‌లో రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ సేలంకు తరలిపోయింది.. మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించ లేదు అంటూ రామకృష్ణను నిలదీశారు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి.. ఆరోజే చంద్రబాబు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ను ఎందుకు తిట్టలేదన్న ఆయన.. పరిటాల వారు గుడ్ విల్ అడిగినందుకే అప్పుడు పరిశ్రమ పోయిందని ఆరోపించారు.. కమ్యూనిస్టు భావాలను పక్కన పెట్టి.. అమ్ముడుపోయారు అంటూ రామకృష్ణపై ఫైర్ అయ్యారు. ఇక, రాప్తాడులో పరిటాల వారికి డిపాజిట్ రావని.. ధర్మవరం, పెనుకొండ చూస్తున్నారని.. కానీ, చంద్రబాబు వాళ్లను రాప్తాడు తిరిగి పంపారని.. రాప్తాడులో పరిటాల వాళ్లు గెలవాలంటే నన్నైనా చంపాలి.. నా క్యారెక్టర్ నైనా చంపాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి కమ్యూనిస్టులు అండగా ఉంటారని చంద్రబాబు చెప్పారు.. ఇప్పుడే అందుకే జాకీ పరిశ్రమ ఇష్యూని తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, 2018లోనే రాప్తాడు నుంచి తరలిపోయిన జాకీ పరిశ్రమను సీపీఐ నేత రామకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర చీఫ్ సోమూవీర్రాజు వెనక్కి తీసుకొస్తారా? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. ఇదే సమయంలో, 10 వేల మంది మహిళలకు ఉపయోగపడే ఉండే విధంగా డైరీ స్థాపిస్తున్నాను అని వెల్లడించారు.. పేజ్(జాకీ) సంస్థ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ.. అనేక రాష్ట్రాల్లో వీరు పెట్టుబడులు పెడుతామని వెనక్కి వెళ్లిపోయారు అని ఆరోపించారు. కాగా, జాకీ పరిశ్రమ.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని విపక్షాలు టార్గెట్ చేయగా.. వారిపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.