CM Chandrababu: దక్షిణ భారత దేశంలో ఏడవ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. పవిత్ర ప్రాంతమైన తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి.. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, జర్మనీ, రష్యా, జపాన్ లాంటి దేశాల్లో 2 వేల ఏళ్ల క్రితం ఎంతో వెనుకబడి ఉన్నాయి.. నాలెడ్జీ ఎకానమీలో భారత్ ఎప్పుడూ సూపర్ పవర్ గానే ఉండేది.. కానీ విదేశీ పాలన, మన పాలసీల వల్ల దేశం ఇబ్బంది పడింది.. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి.. ఐటీ రెవల్యూషన్ అందిపుచుకున్నాం.. ఇప్పుడు మన జనాభానే ఆస్తిగా మారింది.. వివిధ దేశాలు ఏజింగ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి.. వివిధ దేశాల్లోని ప్రముఖ సంస్థలకు భారతీయులే ప్రాతినిధ్యం వహిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Xiaomi Watch 5: షియోమీ వాచ్ 5 స్మార్ట్‌వాచ్ లాంచ్.. 18 రోజుల బ్యాటరీ లైఫ్, eSIM కి సపోర్ట్ తో..
అయితే, భారత దేశం అద్భుతమైన కుటుంబ వ్యవస్థ అని చంద్రబాబు నాయుడు తెలిపారు. అందరికీ భద్రత కల్పించేలా మన కుటుంబ వ్యవస్థ ఉంటుంది.. గంగా-కావేరి నదుల అనుసంధానం అనేది జరగాలి.. అప్పుడు నీటి భద్రత కలుగుతుంది.. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో భారత్ ఛాంపియన్ గా నిలుస్తుంది.. ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నాం.. క్వాంటం, ఏఐ లాంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అభివృద్ధి చేస్తున్నాం.. త్వరలోనే ఏపీ నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేట్ చేయబోతున్నాం.. టెలికాం సంస్కరణలతో కనెక్టివిటీ పెరిగింది.. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎరో స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్ టెక్ పార్క్ వంటి వాటిని ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read Also: BMC Survey: ముంబై మున్సిపల్ ఎన్నికలపై సంచలన సర్వే.. ఎవరికి మొగ్గు ఉందంటే..!
ఇక, యువతకు, పిల్లలకు స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ కంటే హనుమంతుడు చాలా బలవంతుడు.. ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడు.. కృష్ణుడి మహిమలు, శివుని మహత్యం గురించి చెప్పాలని సీఎం చంద్రబాబు అన్నారు. అవతార్ సినిమా కంటే మన మహాభారత, రామాయణం గొప్పదని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. బకాసురుడు లాంటి రాక్షసుల గురించి పిల్లలకు చెప్పాలి.. పిల్లలకు ఎవరు మంచి ఎవరు చెడో కూడా చెప్పాలి.. వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాముడు పాత్రలో నటించి ప్రజల్లో చైతన్యం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్, హిందువుల విలువలను పెంచేలా చేశారు. తన విప్లవాత్మక నిర్ణయాల ద్వారా వాజపేయి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.. సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు.
