Crop Damage: ఏపీలో అకాల వర్షాలు.. 25 మండలాల్లో పంట నష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crop Damage: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి.. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఇక, ఏపీలో మొత్తంగా 25 మండలాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేసినట్టు తెలిపారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.. అసెంబ్లీ మీడియాలో పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలపై సీఎం వైఎస్ జ గన్ సమీక్షించారని తెలిపారు.. వారం రోజులపై పంట నష్టపరిహారంపై ప్రాథమిక అంచనా ఇవ్వాలని కలెక్టర్లని సీఎం ఆదేశించారని తెలిపిన ఆయన.. రైతులు సంతోషంగా ఉన్న సమయంలో అకాల వర్షాలు రావడం దురదృష్టకరం అన్నారు.
Read Also: YSRCP Issues Whip to MLAs: ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన వైసీపీ.. ధిక్కరిస్తే చర్యలు..!
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
ఎన్టీఆర్, కర్నూలు, పార్వతీపురం, ప్రకాశం, మన్యం తదితర జిల్లాలలో వరి, మొక్కజొన్న, అరటి, మినుము, పత్తి పంటలు నష్టపోయినట్లు తెలుస్తోందన్నారు మంత్రి వేణు గోపాల కృష్ణ. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.. నంద్యాల జిల్లాలో 15, ఎన్టీఆర్ జిల్లాలో ఐదు, కర్నూలులో ఒకటి, మన్యం జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో ఒకటి ఇలా మొత్తంగా 25 మండలాల్లో పంట నష్డం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్టు వెల్లడించారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ. కాగా, రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.. సీఎంవో అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం వైఎస్ జగన్‌కు అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్ మొదలుపెట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వారం రోజుల్లో ఈ ఎన్యుమరేషన్ పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎన్యుమరేషన్ పూర్తయ్యాక రైతులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. భారీవర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.
తాజావార్తలు
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!