NTV Telugu Site icon

TDP: ఒంగోలుపై పట్టు సాధించేందుకు టీడీపీ కసరత్తు..

Ongole Tdp

Ongole Tdp

ఒంగోలు తెలుగుదేశానికి ఎంతకీ కొరుకుడుపడని కొయ్యగా తయారైంది. ఆ జిల్లాలో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్లమెంట్ సీటుతో పాటు, మరో అసెంబ్లీ సెగ్మెంట్ కు కూడా ఇంచార్జ్ దొరకడం లేదు. అభ్యర్థుల కసరత్తు, రాజకీయ వ్యూహాలు ఎన్ని ఉన్నా.. ఆ పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదని టాక్.. చివరినిమిషంలో సీటు దక్కగా వచ్చే వలస నేతల కోసమే ఆ పార్టీ ఎదురుచూస్తోందని అధికార పార్టీ విమర్శిస్తోంది.

Wine Bottle : వైన్ బాటిల్ ను ఓపెన్ చేశాక ఎన్ని రోజులు తాగొచ్చో తెలుసా?

ఒంగోలు ఎంపీ స్థానాన్ని టీడీపీ ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఆ సీటుపై వైసీపీ జెండా పాతింది. అలాంటి చోట టీడీపీ గెలుపుపై ఆపసోపాలు పడుతుంది. 2014లో టీడీపీ నుంచి పోటీచేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఓడిపోయారు. దాంతో ఆయన ఎమ్మెల్సీగా కొన్నాళ్లు కొనసాగారు. ఆ తర్వాత ఎన్నికల సమయానికి మాగుంట వైసీపీలో చేరారు. దాంతో సిద్ధారాఘవ రావు బరిలో నిలబడాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో సిద్ధా ఓడిపోయారు. అంతటితో ఎపిసోడ్ అయిపోలేదు. కొంతకాలం తర్వాత సిద్ధా కూడా వైసీపీ గూటికి చేరారు.

Driver Saved Lives: గుండెపోటు వచ్చినా కేర్‌ చేయలే.. 60 మందికి పైగా ప్రాణాలు కాపాడిన డ్రైవర్

అలా అప్పటినుంచి టీడీపీకి ఒంగోలులో ఇంఛార్జ్ లేకుండానే నెట్టుకు వస్తున్నారు. రెండుసార్లు మాత్రమే ఒంగోలు పార్లమెంట్ నుంచి టీడీపీ గెలిచినా.. అక్కడ బలోపేతం చేసుకునేందుకు ఇంతవరకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదని విమర్శలు సొంతపార్టీలోనే ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు దర్శి నియోజకవర్గంలో కూడా రెండేళ్లుగా ఇంచార్జ్ లేకపోవడం పార్టీ మైనస్ గా చెబుతున్నారు. కాగా.. పొత్తులో భాగంగా జనసేనకు దర్శి టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు ముందుకు వస్తున్నారు. అయితే ఈ రెండు స్థానాల్లో పార్టీ స్టాండ్ ఏంటీ.. అధినేత ఆలోచనలు ఎలా ఉన్నాయి. అక్కడ ఏం జరగబోతుందో చూడాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే…