Site icon NTV Telugu

Anam Ramnarayana Reddy: వైఎస్‌ జగన్‌పై మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు.. ఉనికి కోల్పోతానన్న భయంతోనే..!

Anam Ramanarayana Reddy

Anam Ramanarayana Reddy

Anam Ramnarayana Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, వైఎస్‌ జగన్‌పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు రైతులపై అకస్మాత్తుగా ప్రత్యేకమైన ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు.. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రైతుని కూడా పరామర్శించలేదన్న ఆయన.. మొంథా తుఫాను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమించారని, తుఫాను సమయంలో ప్రభుత్వం చక్కగా పని చేసిందని ప్రజలంతా ప్రశంసిస్తున్నారని తెలిపారు. అయితే ఉనికి కోల్పోతానన్న భయంతో వైఎస్ జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. ప్రతిపక్ష నేత అర్హత కూడా జగన్ సంపాదించుకోలేకపోయారని విమర్శించారు.

Read Also: Annavaram : అన్నవరం దేవస్థానంలో కల్తీ నెయ్యి దీపాలు కలకలం !

ప్రభుత్వం పనిచేయకపోతే అసెంబ్లీలోకి వచ్చి చర్చించాలన్నారు. జగన్ ప్రభుత్వంలో చేసిన పనులు, కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు అసెంబ్లీలో చర్చిస్తే ప్రజలకు స్పష్టత వస్తుందని తెలిపారు మంత్రి ఆనం.. వైఎస్‌ జగన్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను ప్రజలు కూడా మర్చిపోయారని వ్యాఖ్యానించారు.. కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు విషయంలో మంత్రి వర్గ ఉపసంఘం పని చేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. కాగా, మొంథా తుఫాన్‌ బాధిత ప్రాంతాల్లో పర్యటించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం విదితమే..

Exit mobile version