Anchor Shyamala: రెడ్ బుక్‌పై యాంకర్ శ్యామల హాట్ కామెంట్స్.. కోడి కోసినా.. కేక్ కట్ చేసినా కేసులే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Shyamala: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో అమలవుతున్నట్లు చెబుతున్న ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ వల్ల ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ మండిపడ్డారు.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రైతు “అన్నమో రామచంద్ర” అంటూ లబోదిబో మంటూ ఏడ్చే పరిస్థితి నెలకొందని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే రెండు సంక్రాంతుల్లో ప్రజల ముఖాల్లో చిరునవ్వు కనిపించకపోవచ్చు.. కానీ, 2029 తర్వాత వచ్చే సంక్రాంతి నాటికి ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు తెచ్చే బాధ్యతను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
ఇక, ఈ బోగి మంటల్లో రాష్ట్రానికి కీడుగా మారిన రెడ్‌బుక్‌ను తగలబెట్టాలని పిలుపునిచ్చారు శ్యామల.. ఈ రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారని ఆరోపించారు. ఇప్పటి పరిస్థితి ఏంటంటే.. ఈ రెడ్‌బుక్ రాజ్యాంగంలో కోడిని కోసినా కేసే.. కేక్ కట్ చేసినా కేసే.. అన్నట్టుగా పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వ వ్యవస్థలు పని చేస్తున్నాయని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితులకు ప్రజలే తగిన సమయంలో గట్టి సమాధానం చెబుతారని, రాష్ట్రంలో మళ్లీ న్యాయం, సంక్షేమం రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ ఆరే శ్యామల..
తాజావార్తలు
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!