Nimmala Ramanaidu: పోలవరం – నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఓ ట్విస్ట్ వచ్చి చేరింది.. సాంకేతిక కారణాల దృష్ట్యా తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్టు పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అధికారికంగా ప్రకటించారు.. అయితే, పోలవరం – నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు పై తెలంగాణ అభ్యంతరాలను సుప్రీంకోర్టు డిస్పోజ్ చేయడంపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు.. కీలక వ్యాఖ్యలు చేశారు.. వృధాగా సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతున్నాం.. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ముందు నుండి మేం చెబుతూనే ఉన్నాం అన్నారు..
Read Also: USB condom: USB కండోమ్ .. ప్రయోజనాలు అదుర్స్ !
ఇక, తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో కలిసి అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షగా పేర్కొన్నారు మంత్రి నిమ్మల.. గత ఐదేళ్లలో గోదావరి వరద నీరు 1,53,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసింది.. ఈ సంవత్సరం కూడా 4600 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోయింది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత గోదావరి ఎగువన కాళేశ్వరం కు ఏ మాదిరిగా అనుమతి ఇచ్చారో.. ఆ విధంగా దిగువన పోలవరం – నల్లమల సాగర్ కు అనుమతి ఇవ్వమంటున్నాం. పోలవరం దగ్గర వరద నీరును ఉపయోగించుకుంటే, ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి, లేదంటే సముద్రంలో ఉప్పునీటిలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. గోదావరిలో పుష్కలంగా నీరు ఉందనే ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరాన్ని తెలంగాణ నిర్మాణం చేస్తున్నా, మేం అడ్డుకోలేదు అన్నారు.. పోలవరం – నల్లమల సాగర్ పూర్తైతే మన రాష్ట్ర ప్రయోజనాలు తీరిన తరువాత నీరు మిగిలితే తెలంగాణకు సైతం ఉపయోగం ఉంటుందని వ్యాఖ్యానించారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు..