RTC Bus Accident: మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందేలా చేస్తాం.. కలెక్టర్ హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakasam Collector AS Dinesh Kumar Comments On RTC Bus Accident: ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద సంఘటన స్థలాన్ని కలెక్టర్ ఏయస్ దినేశ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. ఆర్టీసీ, ట్రాన్స్‌పోర్ట్, పోలీసు అధికారుల ఆధ్వర్యంలోని టెక్నికల్ బృందాలతో విచారణ చేస్తామన్నారు. ఇరుకుగా ఉన్న బ్రిడ్జిని దాటిన బస్సు, ఓ కల్వర్టును ఢీకొట్టిన తర్వాత ఈ ఘటన జరిగిందని వివరించారు. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం కారణం కాకపోవచ్చన్నారు. ఎంత వేగంతో బస్సు వెళ్తుందనేది విచారణలో తేలుతుందన్నారు. మృతదేహాల పోస్ట్‌మార్టం కోసం ఆరుగురు వైద్యులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి తప్పకుండా ఎక్స్‌గ్రేషియా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కచ్ఛితంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Kim Yo Jong: ఉత్తర కొరియా గగనతలంలోకి అమెరికా గూఢచారి విమానం.. కిమ్ సోదరి వార్నింగ్!
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
ఇదిలావుండగా.. కాకినాడలోని ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరవ్వడం కోసం ఓ పెళ్లి బృందం ఒక ఆర్టీసీ బస్సుని అద్దెకు తీసుకుంది. పొదిలి నుంచి ఈ బస్సు కాకినాడకు బయలుదేరింది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నారు. దర్శి వరకు వీరి ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ.. దర్శి సమీపంలో ఎదురుగా ఒక బస్సు సడెన్‌గా రావడంతో, ఆర్టీసీ బస్సు డ్రైవర్ దాన్ని తప్పించబోయాడు. అప్పుడు బస్సు అదుపు తప్పి.. పక్కనే ఉన్న కాలువలో పడింది. బస్సు తలక్రిందులుగా పడటంతో.. ఒకరిపై మరొకరు పడి, ఊపిరాడక 7 మంది మరణించారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
School Bus Accident: కారును ఢీకొట్టిన పాఠశాల బస్సు…. ప్రమాదంలో ఆరుగురి మృతి
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?