NTV Telugu Site icon

Posani Krishna Murali: నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు.. బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం

Posani

Posani

Posani Krishna Murali: చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ లపై విమర్శలు చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న నటుడు పోసాని కృష్ణ మురళిని ఈ రోజు గుంటూరు ప్రభుత్వ హాస్పటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత శ్యామల నగర్లోని న్యాయమూర్తి ఇంట్లో పోసానిని పోలీసులు హాజరు పర్చారు. ఇక, పోసాని తరుపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత కోపంతోనే తనపై టీడీపీ అధికార ప్రతినిధి ఫిర్యాదు చేశాడు అని పోసాని జడ్జి ముందు తెలిపారు. ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదు అని పేర్కొన్నారు.

Read Also: Off The Record: ప్రభాకర్ చౌదరి ఎత్తుగడలకు దగ్గుబాటి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?

అయితే, న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపిస్తూ పోసాని కృష్ణ మురళి బోరును ఏడ్చారు. జడ్జి సమక్షంలో కన్నీరు పెట్టుకున్నారు. తప్పు చేస్తే నరికేయండన్నారు.. నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు.. రెండు ఆపరేషన్లు, స్టంట్లు వేశారు.. నాకు పెళ్లం పిల్లలు ఉన్నారు అని ఆయన వెల్లడించారు. ఇక, రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమని న్యాయమూర్తి ఎదుటే లాయర్లతో పోసాని అన్నారు.