కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో ఒక్కసారిగా అమలాపురం అట్టుడికిపోయింది.. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు… మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఇక, పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది.. దీంతో, అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, నిన్నటి ఘటనలో పాల్గొన్నవారిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.. ఆందోళనకారులను గుర్తించే పనిలో పడింది విశాల్ గున్ని ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్.
Read Also: Dadisetti Raja: అమలాపురం కుట్ర వెనుక చంద్రబాబు, పవన్..!
విధ్వంసం సృష్టించినవారిని గుర్తించేందుకు.. సీసీ కెమెరాలను పరిశీలిస్తోంది ప్రత్యేక బృందం.. ఇక, మంత్రి విశ్వరూప్, పొన్నాడ, కలెక్టరేట్ దగ్గర విధ్వంసం సృష్టించిన వారిని ఇప్పటికే పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.. ప్రధానంగా ఈ అన్ని ఘటనలలో ఒకే టీం పాల్గొనట్లు పోలీసులకి సమాచారం అందినట్టుగా వార్తలు వస్తున్నాయి.. పెట్రోల్ ప్యాకెట్లు విసిరిన వారిని ఇప్పటికే గుర్తించిన పోలీసులు, వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. ఆందోళన, విధ్వంసం జరిగిన ప్రాంతాల పరిధిలోని పోలీసులకి ఇప్పటికే సమాచారం వెళ్లగా.. వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధం అముతున్నారు.. ఇక, ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది.