జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని.. విశాఖలో పవన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, పవన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఆయన.. పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలే మళ్లీ మళ్లీ వల్లేస్తున్నారు.. నీ సినిమా డైలాగులుకు, ఎవరో రాసిస్తే మాట్లాడే మాటలకు మా కార్యకర్తలు భయపడరు.. ఇది సినిమా కాదు.. ఇది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అట్టుకు 10 అట్లు పెడతాం… వాయినానికి పది వాయినాలు వడ్డిస్తామంటూ కౌంటర్ ఇచ్చారు.. ఇక, జనసేన ఈజ్ వెయిటింగ్ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పేర్నినాని.. అదే స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.. టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టులతో కలిసి రండి… వైసీపీ ఈజ్ వెయిటింగ్ అంటూ బదులిచ్చారు. మాట మార్చడంలో పవన్ ను మించిన వారు లేరన్న ఆయన.. మాట మార్చే వారికి ఐకాన్‌గా నిలిచారని పవన్‌పై సెటైర్లు వేశారు.. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఓటేయాలన్న పవన్… 2019లో టీడీపీకి ఓటేయవద్దని చెప్పారని.. 2014లో బీజేపీకి ఓటేయాలన్న పవన్… 2019లో బీజేపీకి ఓటేయవద్దని చెప్పారని గుర్తుచేస్తూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు..
Read Also: BMW Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 230 KMPH వేగంతో లారీని ఢీకొట్టిన కారు
ఇక, రాజధాని అమరావతిపైనా మాట మార్చడం పవన్ కు మాత్రమే చెల్లిందని ఆయన విమర్శించారు. పవన్ మాటలకు నీటి మీద రాతలకు ఏమాత్రం తేడా లేదన్న ఆయన.. విశాఖ ఎయిర్ పోర్టులో ఇద్దరు మహిళా మంత్రులు, ఇద్దరు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు, ఓ దళిత మంత్రిపై దాడికి దిగిన జనసేన కార్యకర్తలను మందలించాల్సింది పోయి.. పవన్ వారిని వెనకేసుకు రావడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. దళిత మంత్రిపై చెప్పులేయిస్తారా? మహిళా మంత్రులను అసభ్య పదజాలంతో తిట్టిస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. పవన్ కు స్వాగతం చెప్పేందుకు జెండా కర్రలతో రావాల్సిన జనసేన కార్యకర్తలు… దాడులు చేసే కర్రలకు జెండాలు కట్టుకుని ఎలా వచ్చారని ప్రశ్నించారు. మంత్రులపై దాడులు చేస్తుంటే… పోలీసులు చేతులు కట్టుకుని కూర్చోరు.. వారి విధులను వారు నిర్వహిస్తారన్న మాజీ మంత్రి.. తనపై ఎవరైనా విమర్శలు చేస్తే సహించలేని పవన్.. తాను మాత్రం ఇతరులపై ఏ మాటలైనా మాట్లాడవచ్చా? అంటూ నిలదీశారు..
తనపై వ్యతిరేక కథనాలు రాశారని పలు పత్రికలు, టీవీ ఛానెళ్లను నిషేధిస్తున్నానని చెప్పిన పవన్… ఇప్పుడు అవే పత్రికలు, టీవీ ఛానెళ్లు తనకు అండగా నిలవాలని ఎలా కోరతారని నిలదీశారు పేర్నినాని.. చంద్రబాబు ఏ మాట చెబితే అదే మాట్లాడుతున్నాడు.. 2019 ఎన్నికలకు ముందు అమరావతి అందరి రాజధాని కాదు అన్నాడు.. ఆయనే కాదు ఆనాడు అన్నీ రాజకీయపార్టీలు అన్నాయి.. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడకొట్టింది.. అలానే అమరావతి యాత్ర కూడా చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. విశాఖలో రాజధాని వద్దు అంతా మాకే కావాలి అంటే వారిలో భావోద్వేగం పెరగదా? అని ప్రశ్నించారు.. అక్కడి ప్రజల ఉద్యమానికి మేం మద్దతు ఇచ్చాం.. అధికారంలో ఉన్నా నిజాయితీ ఉద్యమానికి మద్దతు ఇస్తాం అన్నారు.. ఉక్కు కార్మికులు ఉద్యమం చేస్తే దానికీ మద్దతు ఇచ్చాం.. చంద్రబాబు లా అధికారం ఉంటే ఒకలా లేకుంటే మరోలా ఉండే తత్వం మాదికాదని స్పష్టం చేశారు.
నిలకడలేని తత్వంలో నిష్ణాతుడు పవన్ కల్యాణ్ అని ఫైర్ అయిన పేర్ని.. ఒక బాధ్యతాయుతమైనా ఐపీఎస్ అధికారి గురించి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు.. వాటిని జెండా కర్ర అంటారా…? ఒక బీసీ మంత్రిని 20 నిమిషాలు ఇబ్బంది పెడతారా?సభ్యసమాజం కోసం అయినా నేను చింతిస్తున్నాను అన్నాడా? ఇద్దరు మహిళలు, ఒక బీసీ, ఒక దళిత మంత్రిపై దాడి చేస్తారా? ఒక దళిత మంత్రిపై చెప్పులేస్తారా…? అనుమతి తీసుకుని బహిరంగ సభ పెట్టుకో ఎవరు వద్దన్నారు…? అనుమతి లేకుండా చేసిన ర్యాలీ వల్ల ట్రాఫిక్ ఆగిపోతుంది అని చెప్పడం తప్పా? అనరాని, వినరాని మాటలు తిడతారు…కర్రలతో చంపడానికి ప్రయత్నం చేస్తారా…? కేవలం స్లోగన్స్ ఇస్తేనే తలకాయ పగిలి కుట్లు పడతాయా…? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. పవన్ సిగ్గు విడిచి బరితెగించి మాట్లాడుతున్నాడు.. ఒక్కోసారి ఒక్కో జిల్లాలో మీ నాన్న కానిస్టేబుల్ ఉద్యోగం ఎలా చేశాడు పవన్.. అది జిల్లా స్థాయి పోస్ట్.. .ఒక్కో సారి ఒక్కో జిల్లా చెప్తావెందుకు? ఇష్టారాజ్యంగా నోటికి వచ్చింది మాట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడి ఇప్పుడు విధాన పరంగా మాట్లాడుతాను అంటాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్నినాని.
