NTV Telugu Site icon

Perni Nani: వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వలేదు..

Perni Nani

Perni Nani

Perni Nani Comments: ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే ఏపీలో ఎన్నికల వాతావారం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల రానున్న నేపథ్యంలో అప్పుడే అధికార, ప్రతిపక్ష పార్టీ ప్రచారం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటుండందో ఏపీ రాజకియాలు వెడేక్కాయి. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళుండగా.. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంది.

Also Read: Yemmiganur: ఎమ్మిగనూరు వైసీపీలో కలకలం.. చెన్నకేశవ రెడ్డికి టికెట్‌ ఇస్తే సరి.. లేదంటే..!

ఈ క్రమంలో అనంతరపురంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు‌పై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత లేదు. చంద్రబాబు హయాంలో మైనారిటీ, ఎస్టీ లకు రాజ్యాధికారం లో భాగస్వామ్యం కల్పించలేదు. ఓడిపోయిన నారా లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చారు.

Also Read: Minister Uttam: మేడిగడ్డ పరిశీలనపై సీఎంకి నివేదిక ఇస్తాం.. ఏం చేస్తాం అనేది ప్రకటన చేస్తాం

17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గం లో స్థానం కల్పించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ముస్లిం లకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్ దే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సంక్షేమం ఎందుకు పట్టించుకోలేదు? రుణమాఫీ పేరుతో రైతులు డ్వాక్రా రుణాలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. మీకు మంచి జరగాలనుకుంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి’ అని కోరారు.

Show comments