NTV Telugu Site icon

YS Jagan: చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు..

Jagan

Jagan

YS Jagan: తాడేపల్లిలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4 నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. సూపర్‌ సిక్స్‌ లేదు.. సూపర్‌ సెవెన్‌ లేదన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. స్కూల్స్‌ పోయాయి, చదువులు పోయాయి, విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, డోర్‌ డెలివరీ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా, వ్యవసాయం ఇలా మొత్తం పోయాయని పేర్కొన్నారు. ఇలా అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలింది.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

Read Also: Jaggareddy: డాటా సరిగ్గాలేక రుణమాఫీ ఆలస్యమైంది.. దీంట్లో దాచుకునేది ఏముంది?

ఇక, రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పరిపాలన కొనసాగుతోందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తప్పుడు కేసులు పెడుతున్నారు.. లా అండ్‌ ఆర్డర్ ఎక్కడా కనిపించడంలేదు.. పారదర్శకత అన్నది ఎక్కడా లేదు.. విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం.. ఎన్యుమరేషన్‌ను సరిగ్గా చేయలేకపోయారు.. కలెక్టర్ల కార్యాలయం చుట్టూ బాధితులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. తమకు నచ్చినవారికి మాత్రమే వరద సాయం ఇస్తున్నారు.. పరిపాలన ఇంత ఘోరంగా ఉంది.. అందుకనే ప్రజలను డైవర్ట్‌ చేయడానికి కొత్త టాపిక్స్ తెరమీదకి తెస్తున్నారు.. ఆ కొత్త టాపిక్స్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వీళ్ల చేసిన పనులతో దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Israel-Iran War: ఇరాన్ భయంకరమైన తప్పు చేసింది.. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు

అలాగే, పార్టీ బాగుంటేనే మనం అంతా బాగుంటాం అని వైఎస్ జగన్ అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుంది.. నేను కేవలం మీ అందరి ప్రతినిధిని మాత్రమే.. పార్టీ మన అందరిదీ అన్న విషయాన్ని గుర్తించండి.. పార్టీకోసం కష్డపడేవారికి, ఆ ప్రక్రియలో నష్టపోయినవారికి పూర్తిగా అండగా ఉంటాం.. వారికే ప్రధమ ప్రాధాన్యత ఉంటుందని మాజీ సీఎం చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. దేశంలో అత్యంత బలమైన పార్టీగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం.. పార్టీకి లక్షల మంది కార్యకర్తలు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు.. వారంతా పార్టీ మీద అధారపడి ఉన్నారు.. వీరందర్నీ మన పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురావాలి.. గ్రామల వరకూ అనుబంధ విభాగాల నిర్మాణం కావాలి.. పార్టీ పిలుపు ఇస్తే పైస్థాయి నుంచి కింది స్థాయి వరకూ కదలిక రావాలి అని సూచించారు. ప్రజల తరఫున పోరాటాల్లో చురుగ్గా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.