Pawan Kalyan: మూడు రాజధానులపై తనదైన శైలిలో పంచ్‌లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో ఆయన మాట్లాడుతూ.. ఇది మూడు ముక్కలు ప్రభుత్వం… ఆయన మూడు ముక్కలు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.. రాష్ట్రాని మూడు ముక్కలు చేయాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు.. వైసీపీ నేతలు తనను నిలకడలేని రాజకీయ నాయకుడు అంటుండడం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు అంటే రెండు అంశాలను పరిశీలించాలి. ఒకటి… ఆ నేతను పార్టీ బాగా చూసుకోవాలి. ఇంట్లో జరుగుబాటుకు, అతడి పిల్లల ఖర్చులకు పార్టీ డబ్బులు ఇవ్వాలి. లేకపోతే అతనికి వారసత్వంగా వచ్చిన ఆస్తులైనా ఉండాలి. అలా కాకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటూ, రాజకీయాలు చేస్తూ పూర్తి స్థాయి రాజకీయనేతలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ రాజకీయాలు చేస్తున్నవాళ్లే. కోర్టుల్లో కేసులు వాదిస్తూ కపిల్ సిబాల్ రాజకీయాలు చేయడంలేదా? చిదంబరం కూడా న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేయలేదా? నేను కూడా అంతే… సినిమాలు చేయడం తప్ప నాకు వేరే దారి లేదన్నారు..
Read Also: Pawan Kalyan: సభలకు వచ్చి చప్పట్లు కొట్టి.. ఓట్లు వేసేటప్పుడు వదిలేశారు..
ఇప్పటికిప్పుడు నేను వెళ్లి కాంట్రాక్టులు చేయలేను. కాంట్రాక్టులు చేసుకుంటూ రాజకీయాలు చేసుకోవచ్చా? సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? నా పని నేను చూసుకుంటూనే దేశానికి, ప్రజలకు సమయం కేటాయిస్తున్నాను. నాకు డబ్బు అవసరం లేని సమయం అంటూ వస్తే ఆ రోజున సినిమాలతో సహా మొత్తం వదిలేస్తానని స్పష్టం చేశారు పవన్… ఇక, మీ నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డినే ఎదుర్కొన్నవాడిని.. పంచలూడ దీసికొడతా అన్నాను.. మీనాన్న మనుషులు స్టేజ్ కూల్చేయడం, బెదిరించడం ఎదుర్కొన్నవాడినన్నారు.. చిన్నవయసులోనే తీవ్రవాద ఉద్యమం వైపు వెల్లాలని కూడా బావించేవాడిని.. నేను కాంప్రమైజ్ అయి బతకలేన్న ఆయన.. ప్యాకేజీ అంటే చెప్పు తీసుకొనికొడతాం.. ఈ సారి.. జనసైనికుల చెప్పుతో.. వీర మహిళల చెప్పుతో కొడతానని హెచ్చరించారు.. నా కులం నా వెంట లేకపోతే ఓడిపోవడం కైనా ఇష్టపడతాను తప్ప తప్పుడు రాజకీయం చేయబోను అన్నారు.. నా చేతికి అందుబాటులోకి వచ్చి ఫ్యాకేజ్ స్టార్ అంటే అప్పుడు నేనేంటో చెబుతాను అని వార్నింగ్ ఇచ్చారు.. ఇక, సరైన రాజు లేకపోతే సగం రాజ్యం పోతుంది.. సలహాదారు సజ్జలైతే సంపూర్ణంగా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు పవన్..
ప్రతి జిల్లాని ఒక రాష్ర్టంగా మార్చుకొని , మీరు మీకుటుంబ సభ్యులు పాలించుకోండి అని ఎద్దేవా చేశారు పవన్.. విభజన సమయంలో ఏం పీకుతున్నారు? అని ఫైర్ అయ్యారు.. పదవులు లేకపోతే రాష్ర్టాన్ని , దేశాన్ని ముక్కలు ముక్కలు చేసేయండి.. ముక్కలు ముక్కలు చేస్తామంటే మిమ్మల్ని ముక్కలు చేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.. ఉత్తరాంధ్ర పై ప్రేమ ఉంటే.. విశాఖపట్నం లో 1280 ఎకరాల ఆస్తులు తాకట్టు పెడితే నీ ప్రేమ ఆరోజు ఎక్కడ ఉంది.? అని నిలదీశారు.. రణ స్థలం నుంచే యుద్ధం ప్రకటిస్తున్నా.. నినాదాలతో మార్పు రాదు.. ఓటుగా మార్చగలిగితేనే ప్రయోజనం ఉంటుందన్నారు.. గెలుస్తె గెలుస్తా ఓడిపొతే ఓడిపోతా వెనక్కి మాత్రం వెళ్లేది లేదన్నారు.. సైనికులకు ఇచ్చిన స్థలాలను కూడా కాజేశారు ఇక్కడి అధికార పార్టీనేతలు అంటూ ఆరోపణలు చేసిన ఆయన.. ఐటీ మంత్రి అట.. అలాంటి సన్నాసోడు పేరు కూడా గుర్తు పెట్టుకుంటామా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీరు సభల్లో కొదమ సింహాల్లా గర్జిస్తారు .. కానీ, మిమ్మల్ని ఊర కుక్కలు పాలిస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కోదమ సింహాలాంటి యువకులు గ్రామ సింహాల పాలనలో ఎందుకు మగ్గిపోతారు అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్..