NTV Telugu Site icon

Pawan Kalyan: మా వ్యూహాలు మాకున్నాయి.. వైసీపీ విముక్త ఏపీ టార్గెట్..!

Pawan Kalyan

Pawan Kalyan

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌… జనసేన పీఏసీ ఇవాళ సమావేశమైంది.. సమావేశంలో ఐదు తీర్మానాలను ప్రవేశపెట్టారు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. నాలుగు గంటల పాటు సాగిన పొలిటికల్ ఎఫైర్స్ సమావేశం జరిగింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేనాని.. ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హానికరం.. వైసీపీ విముక్త ఏపీ నినాదంతో ఎన్నికలకు వెళ్తామని వెళ్లడించారు.. వైసీపీ సృష్టించే సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన పవన్.. కొత్తగా వచ్చే సమస్యలతో పాత సమస్యలను మరిచే స్థాయిలో వైసీపీ సృష్టిస్తోందన్నారు.. ఎన్నో అంశాలకు హామీనిచ్చిన జగన్ మాట తప్పారని ఆరోపించారు పవన్‌ కల్యాణ్.

Read Also: Arvind Kejriwal: మనీష్ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలి..

సగటు కుల నాయకుల్లా నేను మాట్లాడాను.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బలిజ, ఒంటరి, తెలగ, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలను కలుపుకుని వైసీపీ విముక్త ఏపీ గురించి పోరాడతామని ప్రకటించారు పవన్‌ కల్యాణ్.. ఇక, మా వ్యూహాలు మాకున్నాయి.. సరైన సమయంలో మా వ్యూహాలు మేం చెబుతామన్న ఆయన.. మా వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.. ఏ వ్యూహమైనా.. వైసీపీ విముక్త ఏపీ కోసమే ఉంటాయని స్పష్టం చేశారు.. అధికారానికి దూరంగా ఉన్న కులాలకు అధికారాన్ని దక్కేలా చేస్తామన్నారు పవన్.. రాయలసీమలో అధికారం దక్కని కులాలు చాలా ఉన్నాయన్న ఆయన.. తమకు అన్యాయం జరిగితే గొంతెత్తి చెప్పుకునే వెసులుబాటు కూడా రాయలసీమలో లేదన్నారు. రాయలసీమకు కొత్త రక్తం కావాలి.. రావాలి అంటూ పిలుపునిచ్చారు. పరిశ్రమలు రావాలంటే రాయలసీమ ప్రాంతాన్ని గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తులకు కప్పం కట్టాల్సిందే.. అందుకే పరిశ్రమలు సీమకు రావడం లేదు.. వలసలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇక, మా మేనిఫెస్టోలో దివ్యాంగులకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తామన్నారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలనే డిమాండ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.