Pawan Kalyan: అనుష్టుప్ నారసింహ యాత్రపై చర్చ.. కీలక సూచనలిచ్చిన జనసేనాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Meeting With Janasena Party Leaders In Hyderabad: శరన్నవరాత్రి పర్వదినాల్లో భాగంగా.. పంచమి తిధిని పురస్కరించుకొని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సరస్వతి పూజ నిర్వహించారు. తెల్లవారుజామునే హైదరాబాద్ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. అమ్మవారిని అర్చించి, తెలుగు రాష్ట్రాలకు సకల శుభాలు కలగచేయాలని ప్రార్థించారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులు, కార్యాలయ నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో.. అక్టోబర్ మాసంలో పార్టీపరంగా నిర్వహించాలనుకున్న సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా.. మంగళగిరిలో నిర్వహించనున్న పార్టీ సమావేశాలకు సంబంధించి ఆయన కీలక సూచనలు ఇచ్చారు. క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించిన వలంటీర్లు, వీర మహిళలతో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదే సమయంలో.. అనుష్టుప్ నారసింహ యాత్రపై పవన్ చర్చించినట్టు తెలిసింది. తొలుత కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు జరిపి.. అక్కడి నుంచి ధర్మపురి క్షేత్రానికి వెళ్లి శ్రీ నరసింహ స్వామిని దర్శించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. అనంతరం తెలంగాణలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అటు.. సోషల్ మీడియా – శతఘ్ని క్రియాశీలక సభ్యులతోనూ పవన్ సమావేశం కానున్నట్టు తెలిపారు. జిల్లాలవారీగా సమీక్షలు చేపట్టబోతున్నారని.. ఈ సమీక్ష సమావేశాలు కృష్ణా జిల్లా, విజయవాడ అర్బన్లతో మొదలవుతాయని తెలిసింది. ‘నా సేన నా వంతు’ కార్యక్రమంపై సమీక్ష చేపట్టడంతో పాటు రాష్ట్ర యాత్ర నిర్వహణకు సంబంధించి సన్నాహకాలపై ముఖ్య నేతలతో సమాలోచన జరపనున్నారు.
Also Read
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
తాజావార్తలు
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..