Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wedding Card Vastu Tips: త్వరలోనే అధికమాసం ముగియనుంది. ఇక శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ మళ్లీ ప్రారంభం కాబోతోంది. హిందూ సంప్రదాయంలో వివాహాన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల కలయికగా కాకుండా, అత్యంత పవిత్రమైన సంస్కారంగా భావిస్తారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన వేడుకకు సంబంధించిన పనులు.. పెళ్లి పత్రిక (వెడ్డింగ్ కార్డ్) ముద్రణతోనే మొదలవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, పెళ్లి పత్రిక అనేది కేవలం బంధుమిత్రులను ఆహ్వానించే కాగితం మాత్రమే కాదు, అది కాబోయే వధూవరుల జీవితంలోకి సానుకూల శక్తిని (పాజిటివ్ ఎనర్జీని) ఆహ్వానించే ఒక గొప్ప మాధ్యమం. అందువల్ల, పత్రిక రంగు, డిజైన్, అందులోని పదాల ఎంపిక దంపతుల వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీ ఇంట్లో కూడా త్వరలో పెళ్లి బాజాలు మోగబోతుంటే, శుభలేఖను సిద్ధం చేసేటప్పుడు ఈ క్రింది వాస్తు నియమాలను తప్పక గుర్తుంచుకోండి.
రంగుల ఎంపికే కీలకం..
వాస్తు శాస్త్రంలో రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అవి నేరుగా శక్తులతో ముడిపడి ఉంటాయట. శుభలేఖల కోసం ఎరుపు, పసుపు, కుంకుమ (కేసరి), మెరూన్ లేదా బంగారు (గోల్డెన్) రంగులను అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఎరుపు రంగు ప్రేమకు, సౌభాగ్యానికి ప్రతీక కాగా.. పసుపు, కేసరి రంగులు విష్ణుమూర్తి, దేవగురు బృహస్పతికి సంబంధించినవిగా భావిస్తారు. ఇవి వైవాహిక జీవితంలో సుఖసంతోషాలను ఇస్తాయి. కాబట్టి పెళ్లి పత్రికలలో నలుపు, ముదురు బూడిద (గ్రే) వంటి అశుభ రంగులను అస్సలు ఉపయోగించకూడదట.
Also Read
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
- Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
- Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
పవిత్రమైన గుర్తులు..
పత్రికపై ఉండే పవిత్ర గుర్తులు అందులోని సానుకూల శక్తిని రెట్టింపు చేస్తాయి. పెళ్లి కార్డుపై వినాయకుడు, స్వస్తిక్, ఓం లేదా కలశం వంటి చిత్రాలు ఖచ్చితంగా ఉండాలి. విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించే దేవుడు కాబట్టి, ఆయన చిత్రం ఉండటం వల్ల పెళ్లి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతాయి. అయితే, కార్డ్‌పై ముద్రించే దేవుళ్ల చిత్రాలు మరీ మోడ్రన్‌గా లేదా వింతగా (అబ్స్ట్రాక్ట్ ఆర్ట్) ఉండకూడదు. అవి దైవత్వాన్ని ప్రతిబింబించేలా, గౌరవప్రదంగా ఉండాలి.
కార్డు సైజు, డిజైన్..
ప్రస్తుతం మార్కెట్లో రకరకాల డిజైన్లలో వినూత్నమైన (కస్టమైజ్డ్) కార్డులు ట్రెండ్‌లో ఉన్నాయి. కానీ, ఇక్కడ వాస్తు నియమాలను అస్సలు పక్కన పెట్టకూడదు. పెళ్లి పత్రిక ఎల్లప్పుడూ చతురస్రం (Square) లేదా దీర్ఘచతురస్రం (Rectangle) ఆకారంలోనే ఉండాలి. ఇవి జీవితంలో సమతుల్యతను సూచిస్తాయి. గుండ్రంగా (రౌండ్), కోడిగుడ్డు ఆకారంలో (ఓవల్) లేదా అంచులు సూదిగా ఉండే ముక్కోణపు (ట్రయాంగిల్) ఆకారాల్లో కార్డులను చేయించకూడదు.
పదాల స్పష్టత, మంత్రాలు
ఆహ్వాన పత్రికలోని భాష ఎంతో మర్యాదపూర్వకంగా, స్పష్టంగా ఉండాలి. శుభలేఖ ప్రారంభంలో ‘ఓం శ్రీ గణేశాయ నమః’ లేదా ఏదైనా ఒక మంగళకరమైన శ్లోకం తప్పక రాయాలి. బంధువులు చదవడానికి వీలుగా ఉండే ఫాంట్లను ఎంచుకోవాలి. మరీ ఎక్కువగా వంకరలు తిరిగి ఉండే, చదవడానికి ఇబ్బంది కలిగించే అక్షరాలను వాడకూడదు. అంతేకాదు.. కార్డు కోసం ఉపయోగించే పేపర్ నాణ్యమైనదిగా, శుభ్రంగా ఉండాలి. ఈ రోజుల్లో కొందరు లగ్జరీ లుక్ కోసం కార్డులపై లెదర్ (చర్మం) ఫినిషింగ్ లేదా సింథటిక్ కెమికల్స్ వాడుతున్నారు. హిందూ ధర్మంలో చర్మాన్ని అపవిత్రంగా భావిస్తారు, కాబట్టి పెళ్లి కార్డులో దీనికి అస్సలు చోటు ఉండకూడదు. పర్యావరణానికి హాని చేయని (ఇకో-ఫ్రెండ్లీ) లేదా హ్యాండ్‌మేడ్ పేపర్లు దీనికి ఉత్తమమైనవి.
తొలి పత్రిక ఎవరికి ఇవ్వాలి?
శాస్త్రాల ప్రకారం, పెళ్లి పత్రికలు అచ్చయ్యి ఇంటికి వచ్చిన తర్వాత.. అన్నింటికంటే మొదటి కార్డును మీ ఇంట్లోని పూజా మందిరంలో విఘ్నేశ్వరుడి పాదాల చెంత ఉంచి పూజించాలి. ఆ తర్వాత రెండో కార్డును మీ ఇలవేల్పు (కులదైవం) పేరు మీద పక్కన పెట్టాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే బంధుమిత్రులకు పెళ్లి పత్రికలను పంచడం ప్రారంభించాలి. ఇలా చేయడం వల్ల వివాహ మహోత్సవానికి ఉన్న అన్ని రకాల దోషాలు తొలగిపోయి, ఆ కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది.
నోట్: ఈ వివరాలు వాస్తు శాస్త్రం నుంచి సేకరించినవి. పైన సమాచారం మీ నమ్మకాన్ని బట్టి ఆచరించాల్సి ఉంటుంది. మీ నమ్మకాన్ని బట్టి ఫాలో అవ్వండి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!