Election Alliance:రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బలమైన శత్రువుతో పోరాడేందుకు అవసరమైనప్పుడు మనకు ఇష్టంలేకున్నా.. కొందరితో కలిసి వెళ్లాల్సి వస్తుందన్న ఆయన.. అయితే మనకు గౌరవం తగ్గకుండా ఉంటేనే కలిసి ముందుకు సాగుతామని.. లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.. ప్రజలంతా మద్దతు ఇస్తే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తాను.. కానీ, తనకు ఆ నమ్మకం కలగాలి.. క్షేత్రస్థాయిలో మీ నుంచి మద్దతు లభిస్తే ఒంటరిగా వెళ్లేందుకు సిద్ధం అయ్యాను. ఇక, ఒంటరిగా గెలిస్తే పొత్త ఎందుకు పెట్టుకుంటానని అన్నారు పవన్… ఇప్పుడు తన దగ్గర ఉంటారని.. ఎన్నికలు రాగానే తన వాడు తన కులం వాడు అని వెళ్లిపోతారని అన్నారు. ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందటం అవసరమా ? అని పరోక్షంగా పొత్తులతో ముందుకు సాగుతానని సంకేతాలు ఇచ్చారు జనసేనాని.. ఈ ఎన్నికలు చాలా కీలకం.. నేను ముఖ్యమంత్రిగా చేయాలంటే అది మీ చేతిలోనే ఉందన్నారు.. అధికారం ఇస్తే సేవకుడిలా ఉంటా.. లేకపోతే అలానిలబడతానని ప్రకటించారు పవన్..
Read Also: Pawan Kalyan: ఇది మూడు ముక్కల సర్కార్.. ఆయన మూడు ముక్కల సీఎం..
నేను ఒక్క కులానికి కాపు కాయను .. నాకులాని ఎంత గౌరవం ఇస్తానో మిగిలిన అన్ని కులాలకు అంతేగౌరవం ఇస్తానని స్పష్టం చేశారు పవన్.. వచ్చే ఎన్నికలలో ఓట్లు చీలకూడదు. ఒంటరిగా వెళ్లడానికి నేను సిద్ధమే.. భయపడే వ్యక్తిని మాత్రం కాదన్నారు.. గౌరవం తగ్గకుండా ఉంటే కలిసి వెళ్దాం.. లేదంటే ఒంటిరిగా పోదాం.. కానీ, మీరు క్షేత్రస్థాయిలో బలం కలిగిస్తే నేను ఒంటరిగానే వెళ్తానన్నారు.. సభలో ఒక మాట అంటూ ఇంటికెల్లి ఎన్నికలలో మారిపోతున్నారన్న ఆయన.. మనకి పడని శత్రువులు ఉంటే అందరం కలసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు..
వారాహితో వస్తా.. ఎవడాపుతాడో నేను చూస్తా నంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్.. ఒంటరిగా లేదా మిశ్రమంగా ప్రభుత్వం వస్తుందనే వ్యాఖ్యలు చేసిన ఆయన.. ప్రభుత్వం వస్తే ఉత్తరాంధ్ర వలసలు ఆపుతాం.. పరిశ్రమలు తీసుకువస్తాం.. వలసలు మాటపోయి ఆర్థికరాజధాని చేస్తాం అన్నారు.. మూడు కులాల చుట్టూనే రాజకీయాలు ఎందుకు తిరగాలి…? అని ప్రశ్నించారు.. ఆ పద్ధతి మారాలి అన్నారు. జనసేన ప్రభుత్వమా..? మిశ్రమ ప్రభుత్వమా..? ఏది అధికారంలోకి వచ్చిన స్థానిక సంస్థలను బలోపేతం చేస్తాం అన్నారు.. యూనివర్సిటీలను వైసీపీ కార్యాలయంగా మార్చిన వాళ్లను దోషులుగా పరిగణిస్తున్నాం అన్నారు పవన్.. వాళ్లకు శిక్ష తప్పదని హెచ్చరించారు.. వచ్చే ఎన్నికలు కీలకం… రోడ్లు మీదకు ఎక్కుతాం.. మీ ఒంటి మీద దెబ్బ పడితే నేను అడ్దుగా నిలబడతానని భరోసా కల్పించారు పవన్ కల్యాణ్.